ఓవర్సీస్‌లో “అఖండ” కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే...

By Surya Prakash  |  First Published Dec 4, 2021, 8:06 AM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అఖండ.  ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. 


 నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా గురువారం రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మార్నింగ్ షోకే హిట్ టాక్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన బాలకృష్ణ అభిమానులతో థియేటర్లు నిండిపోతున్నాయి. సినిమా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల కేరింతలు.. అభిమానుల సందడితో సందడిగా నెలకొంటొంది.  బాలయ్య ని బోయపాటి చూపించిన నెక్స్ట్ లెవెల్ మాస్ ప్రెజెంటేషన్ లో తనకి తానే సాటి అని మళ్ళీ ప్రూవ్ చేశారు. రెండు వేరియేషన్ లో కూడా బాలయ్య లోని మాస్ విశ్వరూపం దేనికదే డిఫరెంట్ గా సాలిడ్ ట్రీట్ ని అందించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టిస్తుంది.

ట్రేడ్ లెక్కల ప్రకారం అమెరికాలో ఈ చిత్రం హాఫ్ మిలియన్ (500K+) డాలర్స్ మార్క్‌ని సంపాదించుకుంది. అయితే 2021లో ఒక తెలుగు సినిమాకి ఈ తరహా కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి కావటం విశేషం. ఇదే జోరు కొనసాగితే ఈ వీకెండ్ లోపలే  వన్ మిలియన్ మార్క్ చేరుకోవడం గ్యారంటీ.

Latest Videos

ఇక గత రెండేళ్లుగా డీలా పడ్డ థియేటర్ల యాజమానులకు… దర్శకనిర్మాతలకు అఖండ సినిమా బూస్టింగ్ ఇచ్చింది. ఓవర్సీస్‏లో అత్యధిక ప్రీమియర్ గ్రాసర్ గా అఖండ నిలిచింది. ఏకంగా మూడు లక్షల డాలర్లకు పైగా కేవలం ప్రీమియర్ షోల ద్వారానే రాబట్టింది. ఇంతటి స్థాయిలో ఈ ఏడాదిలో ఏ సినిమా వసూళ్లను సాధించలేదు. మరోవైపు.. ఒక్కరోజే మూడు లక్షల డాలర్ల వసూళ్లను రాబట్టిన అఖండ లాంగ్ రన్‏లో రెండు మిలియన్ల డాలర్ల వరకు వెళ్తోంది. అమెరికా అయినా.. ఆస్ట్రేలియా అయినా.. ఆంధ్ర అయనా.. తెలంగాణ అయినా మాస్ జాతర కొనసాగుతుందంటూ చిత్రయూనిట్స్ పోస్టర్స్ రిలీజ్ చేసారు. ఓనర్సీస్‍లో బాక్సాఫీస్ వద్ద బాలయ్య అఖండతో రికార్డులు క్రియేట్ చేశాడంటూ అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also read Balakrishna: నందమూరి అందగాడిని అలా పిలవకండయ్యా!
ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‏గా నటించగా.. విలన్ పాత్రలో శ్రీకాంత్ అదరగొట్టాడు. ఈ చిత్రాన్ని ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించగా. థమన్ సంగీతం అందించారు.

Also read Akhanda: బి.గోపాల్ అలా.. బోయపాటి ఇలా.. బాలయ్య విషయంలో అదొక్కటే రిగ్రెట్

 
 

click me!