చిరంజీవి కోలుకోవాలని మహేష్‌, రవితేజ, సురేందర్‌రెడ్డి ప్రార్థనలు

Published : Nov 09, 2020, 04:37 PM ISTUpdated : Nov 09, 2020, 04:46 PM IST
చిరంజీవి కోలుకోవాలని మహేష్‌, రవితేజ, సురేందర్‌రెడ్డి ప్రార్థనలు

సారాంశం

చిరంజీవి త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు ట్విట్టర్‌ ద్వారా కోరుకుంటున్నార. మహేష్‌బాబు స్పందిస్తూ, `చిరంజీవి గారు త్వరగా కోలుకోండి. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా` అని ట్వీట్‌ చేశారు.

చిరంజీవి కరోనాకి గురైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన సోమవారం ప్రకటించారు. తనకు లక్షణాలేవి లేవని, `ఆచార్య` షూటింగ్‌లో పాల్గొనేందుకు కరోనా టెస్ట్ చేసుకోగా పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. దీంతో సీఎం కేసీఆర్‌, నాగార్జున, సుమ, బిగ్‌బాస్‌ టీమ్‌తోసహ అనేక మంది ఆందోళన చెందుతున్నారు. ఇటీవల చిరంజీవి కలిసినవారిలో గుబులు పట్టుకుంది. 

ఇదిలా ఉంటే చిరంజీవి త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు ట్విట్టర్‌ ద్వారా కోరుకుంటున్నార. మహేష్‌బాబు స్పందిస్తూ, `చిరంజీవి గారు త్వరగా కోలుకోండి. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా` అని ట్వీట్‌ చేశారు. జాగ్రత్తగా ఉండండి, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు రవితేజ ట్వీట్‌ చేశారు. చిరు కోడలు ఉపాస సైతం స్పందించి `మామయ్యా.. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా` అని అన్నారు. వీరితోపాటు దర్శకుడు సురేందర్‌రెడ్డి, హీరో నిఖిల్‌, దర్శకుడు మారుతి, దేవిశ్రీ ప్రసాద్‌, డివివి ఎంటర్టైన్‌మెంట్‌, వెంకీ కుడుముల, రఘు కుంచె వంటి వారు ట్వీట్లు చేశారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

పూసలమ్మిన మోనాలిసా ఎంతగా మారిపోయిందో చూశారా
ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా, కానీ ఫ్లాప్..హీరోని తలుచుకుని రోజూ బాధపడే డైరెక్టర్ ఎవరంటే