కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన తమన్నా.. లెవెన్త్ హవర్‌

Published : Nov 09, 2020, 03:33 PM ISTUpdated : Nov 09, 2020, 03:34 PM IST
కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన తమన్నా.. లెవెన్త్ హవర్‌

సారాంశం

తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా సైతం తెలుగులో ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తుంది. `ఆహా` కోసం ఆమె నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ పేరుని తాజాగా ప్రకటించారు. దీనికి `లెవెన్త్ హవర్‌'(11 th hour) అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

ఇటీవల స్టార్‌ హీరోయిన్లు సైతం వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. దీంతో ఆయా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లకు క్రేజ్‌ తీసుకొస్తున్నారు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా సైతం తెలుగులో ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తుంది. `ఆహా` కోసం ఆమె నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ పేరుని తాజాగా ప్రకటించారు. దీనికి `లెవెన్త్ హవర్‌'(11 th hour) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. 

సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మెంట్‌లో తమన్నా ఈ విషయాన్ని వెల్లడించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తన మొదటి వెబ్‌ సిరీస్‌ ఫస్ట్ లుక్‌ని పంచుకుంది. కొత్త ప్రయాణం, కొత్త కథ, కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. దీనికి ప్రముఖ దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సమంత లాంటి కథానాయికలు వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారు. అలాగే ఆమె `సామ్‌జామ్‌` పేరుతో `ఆహా`లో ఓ టాక్‌ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు తమన్నా వెబ్‌ సిరీస్‌లోకి అడుగు పెట్టడం విశేషం. 

ప్రస్తుతం తమన్నా తెలుగులో గోపీచంద్‌ సరసన `సీటీమార్‌` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు `గుర్తుందా సీతాకాలం` చిత్రంలో సత్యదేవ్‌కి జోడీగా రొమాన్స్ చేస్తుంది. అలాగే నితిన్‌తో కలిసి `అంధాదున్‌` రీమేక్‌లో నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో నటిస్తుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

'రౌడీ జనార్ధన' గ్లింప్స్ రివ్యూ.. కింగ్డమ్ లా గురి తప్పేలా లేదు, విజయ్ దేవరకొండ బీభత్సం చూశారా
'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ..రవితేజ, శర్వానంద్ ఇద్దరిలో ఎవరో ఒకరికి డ్యామేజ్ తప్పదా ?