Ravi Teja:రవితేజపై ఇండస్ట్రీ జోక్, ఉక్రెయిన్ తో ముడెట్టి...విన్నారా?

By Surya PrakashFirst Published May 13, 2022, 10:07 AM IST
Highlights

'క్రాక్' అనే  ఓ హిట్  సినిమాతో ఆ మధ్యన  ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫస్ట్ వేవ్ తరువాత విడుదలైన ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. దీంతో రవితేజ మళ్లీ ట్రాక్ లో పడ్డాడు. వరుస సినిమాలను ప్రకటిస్తున్నాడు. 


హిట్, ఫ్లాఫ్ కు సంభందం లేకుండా వరస సినిమాలు చేస్తున్న హీరో రవితేజ. వరస డిజాస్టర్స్ టైమ్ లో ఓ సూపర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి రావటం ఆయన కెరీర్ కు అలవాటుగా మారింది. దాంతో తన రెమ్యునరేషన్ విషయంలో కూడా ఎప్పుడూ రాజీ పడడు. అలాగే ఆయన రెమ్యునరేషన్ మీద ఓ జోక్ ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటారు. అదేమిటంటే...బయిట టామోటా రేటు పెరిగినా ఆయన వెంటనే తన నెక్ట్స్ సినిమాకు రెమ్యునరేషన్ పెంచుతాడని. ప్రొద్దున్నే వార్తలు చూసి ఆయన రెమ్యునేషన్ పెంచాలా వద్దాలా అని డిసైడ్ చేసుకుంటాడని సరదాగా చెప్పుకుంటారు. అయితే ఈ జోక్ ని ప్రక్కన పెడితే ఆయన రెమ్యునరేషన్ తాజాగా మరోసారి  పెరిగిందని సమాచారం. ఉక్రేయిన్ యుద్దం కాబట్టి రవితేజ పెంచేసాడని ఫన్ చేసుకుంటున్నారు.  

అందుతున్న సమాచారం ప్రకారం.. మాస్ మహారాజా రవితేజ రెమ్యునరేషన్ రూ.18 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు దాన్ని పెంచేసారట.‘క్రాక్‌’ విడుదలకు ముందే 12 కోట్ల రూపాయలను అందుకున్నాడు. సినిమా సక్సెస్ తర్వాత పారితోషికాన్ని 15 కోట్ల రూపాయలకు పెంచేశాడు. ఆ తర్వాత రూ.17 కోట్లకు. అయితే ఈ ఏడాది ‘ఖిలాడీ’తో భారీ ప్లాప్‌ చవిచూశాడు. అయితే తన కొత్తగా కమిటైన సినిమాలకు ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం మాత్రం ఆగలేదు.

ఇండస్ట్రీ గాసిప్ ప్రకారం, రవితేజ ఇప్పుడు 20 కోట్ల పారితోషికం అడగడం ప్రారంభించాడు. తన సినిమాల హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా 25 కోట్ల రూపాయలకు పైగా వస్తున్నాయంటూ మాస్ మహారాజ్ రెమ్యునరేషన్ పెంచేస్తున్నాడని చెప్తున్నారు.

రవితేజ తదుపరి చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’, జూన్ 17న థియేటర్లలోకి రానుంది. ‘ధమాకా’, ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సెట్స్‌పై ఉన్నాయి. రీసెంట్ గా సుధీర్ వర్మతో మరో సినిమా అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకి అభిషేక్ నామాతో పాటు రవితేజ కూడా నిర్మాతగా వ్యవహరించనున్నాడు. కాబట్టి లాభాల్లో వాటా తీసుకోబోతున్నాడు. 

click me!