
'రంగస్థలం' సినిమా సక్సెస్ తరువాత దర్శకుడు సుకుమార్.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం మహేష్ కి కథ చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుకుమార్.. మహేష్ కోసం రెండు కథలను సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే మహేష్ కి ఓ కథ వినిపించాయి. తెలంగాణాలో రజాకార్ల ఉద్యమకాలం నేపధ్యంలో జరిగిన పీరియాడిక్ లైన్ అది. అయితే ఈ కథతో సినిమా చేయడానికి మహేష్ సముఖంగా లేరని తెలుస్తోంది. దాదాపు చాలా మంది హీరోలు పీరియాడిక్ సినిమాలు చేశారు.. చేస్తున్నారు.
మళ్లీ అదే జోనర్ లో సినిమా చేయడంపై మహేష్ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. పైగా రజాకార్ల మూవ్మెంట్ కథాకాలం అంటే మళ్లీ ఏవైనా సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని మహేష్ పీరియాడిక్ కథ కాకుండా మరో సబ్జెక్ట్ చూడమని సుకుమార్ కి చెప్పినట్లు తెలుస్తోంది.
సుకుమార్ దగ్గర సగంకి పైగా సీన్లు రాసుకున్న మరో కథ ఉందట. ఇప్పుడు దాన్ని మహేష్ కి వినిపించాలని భావిస్తున్నాడు. మహేష్ 'మహర్షి' షెడ్యూల్ కోసం అమెరికాకు వెళ్లారు. ఆయన తిరిగొచ్చిన తరువాత సుకుమార్ కథ వినిపిస్తాడని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
మహేష్ మరో ప్రయోగానికి సిద్దమేనా?
బావ కొడుక్కి మహేష్ సపోర్ట్ లేదా..?
తప్పులో కాలేసిన హీరో మహేష్ బాబు