
స్టార్ హీరోల విషయంలో అభిమానులకు కొన్ని అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా హీరోలు నడుచుకోకుంటే ఫ్యాన్స్ నిరాశచెందుతారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ అభిమానుల పరిస్థితి అలాగే ఉంది. మహేష్ బాబు ప్రస్తుతం బ్రాండ్ అంబాసిడర్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
మహేష్ బ్రాండ్ వాల్యూకి తగ్గట్లుగా కోట్లల్లో రెమ్యునరేషన్ వచ్చి పడుతోంది. ఇటీవల మహేష్ బాబు జీ నెట్వర్క్ సంస్థకి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. దీనికోసం మహేష్ రూ 10 కోట్ల పారితోషికంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే జీ సంస్థ మహేష్ బాబుని ఒక రేంజ్ లో వాడేసుకుంటోంది.
ఇటీవల మహేష్ బాబు సదరు ఛానల్ లో ప్రసారం అయ్యే డాన్స్ షోకి కుమార్తె తో కలసి అతిథిగా హాజరయ్యారు. అంతవరకు బాగానే ఉంది. డాన్స్ షోకి చీఫ్ గెస్ట్ గా హాజరు కావడంలో తప్పు లేదు. గతంలో చాలా మంది హీరోలు ఇలా చేశారు.
కానీ మహేష్ బాబు స్థాయిని మరచిపోయి ఆయన ఫోటోని సీరియల్ ప్రమోషన్స్ కోసం కూడా వాడేసుకుంటున్నారు. త్వరలో ప్రారంభం కాబోయే పడమటి సంధ్యారాగం అనే సీరియల్ పోస్టర్ పై మహేష్ బాబు ఫోటో వేశారు. అది కూడా సదరు సీరియల్ నటులతో కలిపి వేయడం మహేష్ అభిమానులకు షాకింగ్ గా మారింది.
టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన మహేష్ స్థాయికి ఇలా సీరియల్స్ ప్రమోషన్స్ లో భాగం కావడం తగదు అని అభిమానులే అంటున్నారు. ఇక నెట్టింట అయితే ఈ పోస్టర్ పై ఒక రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. సో మహేష్ బాబు ఇకనైనా తన ఎండార్స్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.