చనిపోయేవరకూ ఇలానే ఉంటా.. కంగనా వ్యాఖ్యలపై మహేష్ భట్!

Published : May 01, 2019, 02:08 PM IST
చనిపోయేవరకూ ఇలానే ఉంటా.. కంగనా వ్యాఖ్యలపై మహేష్ భట్!

సారాంశం

గత కొద్దిరోజులుగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కి, భట్ ఫ్యామిలీకి మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరుగుతోంది. 

గత కొద్దిరోజులుగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కి, భట్ ఫ్యామిలీకి మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరుగుతోంది. ప్రముఖ దర్శకనిర్మాత మహేష్ భట్.. కంగనాపై చెప్పు విసిరారని ఆమె సోదరి రంగోలి ట్వీట్ చేశారు. అలానే కంగనా సందర్భం దొరికిన ప్రతీసారి అలియాభట్ నటనను విమర్శిస్తూ ఆమెను టార్గెట్ చేస్తోంది. దీంతో మహేష్ భట్ భార్య సోనీ రజ్దాన్.. కంగనాపై విరుచుకుపడింది.

కంగనాకు అవకాశాలిచ్చి ప్రోత్సహించిన తన భర్తపై, కూతురుపై కామెంట్స్ చేయడం విడ్డూరంగా ఉందని మండిపడింది. ఈ విషయంలో అలియా ఒక్కమాట కూడా నోరు జారకుండా మెచ్యూర్డ్ గా వ్యవహరిస్తోంది. తాజాగా కంగనా చేసిన వ్యాఖ్యలపై మహేష్ భట్ స్పందించారు. కంగనా చిన్నపిల్ల అని, తన కూతురు లాంటిదని.. తమతోనే సినీ ప్రయాణాన్ని ప్రారంభించిందని అన్నారు.

కంగనా బంధువు తనపై ఏవో ఆరోపణలు చేసినంత మాత్రాన స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. చిన్న పిల్లల ప్రవర్తన పట్ల వేలు ఎత్తి చూపే సంస్కృతి మనది కాదని, అలాంటి పనులు తాను ఎప్పటికీ చేయనని అన్నారు. తనకున్న సంస్కారం కారణంగానే ఎవరేమంటున్నా ఊరుకుంటున్నానని.. చనిపోయేవరకు ఇలానే ఉంటానని పరోక్షంగా కంగనా తీరుని ఎత్తిచూపారు.

కంగనా మొదటి చిత్రాన్ని మహేష్ భట్ నిర్మించారు. అదే సమయంలో మరో సినిమాలో నటించమని మహేష్ భట్.. కంగనాని కోరితే పాత్ర నచ్చక ఆమె తిరస్కరించిందట. దీంతో కక్ష పెంచుకొని మహేష్ భట్ 'వావ్ లంహే' సినిమా చూడడానికి వచ్చిన కంగనాపై చెప్పు విసిరాడని కంగనా సోదరి రంగోలి ఆరోపించింది. 

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today: బాలు పై బయటపడిన ప్రభావతి ప్రేమ, చిటికెలు వేసి మరీ శపథం చేసిన మీన
2025 Flop Movies: 100 కోట్లు దాటినా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌ అయిన 8 సినిమాలు