సినిమా స్టూడియోలో అగ్ని ప్రమాదం.. కోట్లలో ఆస్తి నష్టం!

Published : May 01, 2019, 12:48 PM IST
సినిమా స్టూడియోలో అగ్ని ప్రమాదం.. కోట్లలో ఆస్తి నష్టం!

సారాంశం

ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ కు చెందిన ధర్మా ప్రొడక్షన్ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 

ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ కు చెందిన ధర్మా ప్రొడక్షన్ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం నాడు తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ బ్యానర్ పై తెరకక్కిన ఎన్నో సినిమాలకు సంబందించిన జ్ఞాపకాలకు కూడా పోగొట్టుకున్నట్లు  తెలుస్తోంది.

స్టూడియోలో ఎక్కువగా కాస్ట్యూమ్స్, సినిమా సెట్టింగ్ లకు వినియోగించే వస్తువులు ఉండడం మంటలు త్వరగా వ్యాపించి మరింత ఆస్తి నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. 1976లో కరణ్ తండ్రి యష్ జోహార్ ఈ స్టూడియోని ప్రారంభించారు.

కెమెరాలు, కాస్ట్యూమ్స్ సినిమాలకు అవసరమైన విలువైన వస్తువులను స్టూడియోలోనే భద్రపరుస్తుంటారు. ఈ ప్రమాదంలో కొన్ని సినిమా స్క్రిప్ట్ లు కూడా కాలిపోయినట్లుగా  బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం కరణ్ జోహార్ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు గుడ్ న్యూస్, సూర్యవంశీ, తక్త్ వంటి చిత్రాలను కూడా తెరకెక్కిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

బాక్సాఫీస్ వద్ద 2025లో 5 పెద్ద క్లాష్‌లు, ఎన్టీఆర్ సినిమాతో పాటు పోటీలో దారుణంగా నష్టపోయినవి ఇవే
Allu Arjun: 5 సినిమాలతో అల్లు అర్జున్ సంచలనం, అప్‌కమింగ్ మూవీస్ లిస్ట్.. ఆ మూవీ మాత్రం చాలా స్పెషల్