మహేశ్ బాబు కొడుకు గౌతమ్ టెన్త్ రిజల్ట్స్.. ఏ గ్రేడ్ సాధించాడో తెలుసా? ఇంకా ఎదగాలంటున్న నమ్రతా..

Published : May 26, 2022, 01:39 PM ISTUpdated : May 26, 2022, 01:49 PM IST
మహేశ్ బాబు కొడుకు గౌతమ్ టెన్త్ రిజల్ట్స్.. ఏ గ్రేడ్ సాధించాడో తెలుసా? ఇంకా ఎదగాలంటున్న నమ్రతా..

సారాంశం

స్టార్ కిడ్ గౌతమ్ ఘట్టమనేని (Gautam Ghattamaneni) తాజాగా తన స్కూల్ ఎడ్యుకేషన్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. ఇటీవల విడుదలైన పది ఫలితాల్లో గౌతమ్ టాప్ స్కోర్ చేశాడు. ఈ సందర్భంగా నమ్రతా అభినందిస్తూ.. పలు సూచనలు చేసింది.  

సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ ఏకైక పుత్రుడు గౌతమ్ ఘట్టమనేని. ఈయన 2006 ఆగస్టులో హైదరాబాద్ లోనే జన్మించాడు. స్టార్ కిడ్ గా గౌతమ్ అందరికీ సుపరిచితుడే. గౌతమ్ తాజాగా తన స్కూల్ ఎడ్యుకేషన్ విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. చిరెక్ (CHIREC) ఇంటర్నేషనల్ స్కూల్ లో సీబీఎస్ఈలో తాజాగా పదో తరగతి పూర్తి చేశాడు. ఇటీవల పది ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఈ సందర్భంగా గౌతమ్ టెన్త్ రిజల్ట్స్ లో ప్రథమ గ్రేడ్ ను సాధించాడు. దీంతో కుటుంబ సభ్యులు హ్యాపీగా ఫీలవుతున్నారు. గౌతమ్ తల్లి, నటి శిరోద్కర్ గౌతమ్ ను అభినందిస్తూ తాజాగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా విషయాన్ని తెలియజేసింది.

ఈ సందర్భంగా గౌతమ్ ను అభినందిస్తూ, భవిష్యత్ లక్ష్యాన్ని సూచించి సుధీర్ఘమైన నోట్ కూడా రాసింది.  ‘గౌతమ్ పదో తరగతి పూర్తి చేశాడు. పది ఫలితాల్లో తను గ్రేడ్ 10 సాధించాడు. అలాగే తన సబ్జెక్ట్‌లన్నింటిలో మంచి ఉత్తీర్ణత సాధించాడు!! నేను చాలా హ్యాపీగా, గర్వంగా ఉన్నాను. మరో ఫేజ్, కొత్త ఛాలెంజ్ లనూ ఇలాగే చేధించాలి. మేము ఎల్లప్పుడూ నీకు అండగా ఉంటాం. నీవు మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నాం. నీ విధికి నువ్వే రాజు. ఇలాగే మమ్మల్ని గర్వించేలా చేస్తూ ఉండాలి’ అని పేర్కొంది. 

గౌతమ్ చదువుతో  పాటు  ఇతర యాక్టివిటీల్లోనూ చురుకుగానే ఉంటున్నారు. ఇప్పటికే తన తండ్రి మహేశ్ బాబు (Mahesh Babu)తో కలిసి చైల్డ్ ఆర్టిస్గ్ గా ‘1 నేనొక్కడినే’ చిత్రంలో నటించాడు. బిగ్ స్క్రీన్ పై కనిపించి తెలుగు ఆడియెన్స్ ను పరిచయం చేసుకున్నాడు. చెల్లి సితారా కూడా ‘సర్కారు వారి పాట’ చిత్రంలో తండ్రితో కలిసి నటించింది. అదేవిధంగా 2018లోనే గౌతమ్ తన ప్రొఫెషనల్ స్విమ్మింగ్‌ని ప్రారంభించి, తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్‌ పోటీల్లో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నాడు. 

 

PREV
click me!

Recommended Stories

Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?
Director KK Passed Away: నాగార్జున `కేడి` మూవీ డైరెక్టర్‌ కన్నుమూత.. సందీప్‌ రెడ్డి వంగాకి ఈయనే గురువు