బిగ్‌బాస్‌ బంపర్‌ ఆఫర్‌..సామాన్యులకు షోలోకి ఆహ్వానం.. నాగార్జున ప్రకటన..

Published : May 26, 2022, 01:38 PM IST
బిగ్‌బాస్‌ బంపర్‌ ఆఫర్‌..సామాన్యులకు షోలోకి ఆహ్వానం.. నాగార్జున ప్రకటన..

సారాంశం

బిగ్‌బాస్‌ 6 బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. వచ్చే సీజన్‌లో సామాన్యులు కూడా పాల్గొనే అవకాశం కల్పించింది. ఈవిషయాన్ని నాగార్జున వెల్లడించారు.

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా ఆదరణ పొందుతున్న బిగ్‌బాస్‌ షో తెలుగులో ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. ఒక ఓటీటీ సీజన్‌ని కూడా కంప్లీట్‌ చేసుకుంది. గత వారం ముగిసిన బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ఓటీటీ తెలుగు షోలో బిందు మాధవి విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా బిగ్‌బాస్‌ మరో బంపర్‌ ఆఫర్‌ తో ముందుకొచ్చింది. సామాన్యులకు బిగ్‌బాస్‌ షోలో పాల్గొనే అరుదైన అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు నాగార్జునతో కూడిన ఓ వీడియోని విడుదల చేశారు స్టార్‌మా టీమ్‌. 

ఇందులో నాగార్జున చెబుతూ, బిగ్‌బాస్‌ సీజన్‌ 6 త్వరలో ప్రారంభం కాబోతుందన్నారు. `బిగ్‌బాస్‌ సీజన్‌ 6లో సామాన్యులకు ఇంట్లోకి ఆహ్వానం. ఇన్నాళ్లు మీరు బిగ్‌బాస్‌ షోను చూశారు, ఆనందించారు. ఆ ఇంట్లో ఉండాలనుకుంటున్నారు కదూ, అందుకే స్టార్‌ మా ఇస్తోంది.. ఆకాశాన్ని అందుకునే అవకాశం! వన్‌ టైం గోల్డెన్‌ ఛాన్స్‌.. టికెట్‌ టు బిగ్‌బాస్‌ సీజన్‌ 6. మరిన్ని వివరాల కోసం స్టార్‌ మా వారి వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అవండి` అని చెప్పుకొచ్చాడు. బిగ్‌బాస్‌ హౌస్‌కి వెళ్లాలనుకునేవారు  starmaa.startv.com ఓపెన్‌ చేసి మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. 

ఇదిలా ఉంటే త్వరలో బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ మొదలు కాబోతున్న నేపథ్యంలో ఇటీవల `బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌`లో పాల్గొన్న కంటెస్టెంట్లు యాంకర్‌ శివ, శ్రీరాపాక వంటి పలువురు కంటెస్టెంట్లు పాల్గొననున్నారంటూ ప్రచారం మొదలైంది. మరోవైపు ఈసారి కొత్తవారికి, అతి సామాన్యులకు కూడా ఛాన్స్ ఇస్తుండటం విశేషం.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?
Director KK Passed Away: నాగార్జున `కేడి` మూవీ డైరెక్టర్‌ కన్నుమూత.. సందీప్‌ రెడ్డి వంగాకి ఈయనే గురువు