ఆరుగురు డైరక్టర్స్ తో మహేష్ వరస మీటింగ్స్, ఎవరెవరు అంటే...

By Surya PrakashFirst Published Sep 22, 2021, 8:53 AM IST
Highlights

ఆయన హైదరాబాద్ పార్క్ హయ్యిత్ లో వరసగా ఆరుగురు డైరక్టర్స్ తో మీటింగ్ లలో పాల్గొన్నారని తెలిసింది. మహేష్ కు ఉన్న డెడికేషన్, వర్క్ కల్చర్ తోనే ఇది సాధ్యమైందంటున్నారు. ఆ ఆరుగురు డైరక్టర్స్ ఎవరూ అంటే...
 

తెలుగులో బిజీగా ఉన్న స్టార్ హీరోలలో మహేష్ బాబు ఒకరు. కోవిడ్ తో కాస్త స్లో అయిన కెరీర్ ని ఆయన పరుగులు పెట్టించాలనుకుంటున్నారు. అందులో భాగంగా కొత్త కథలు వినటం, డైరక్టర్స్ తో మీటింగ్ లలో పాల్గొనటం చేస్తున్నారు.  తాజాగా ఆయన హైదరాబాద్ పార్క్ హయ్యిత్ లో వరసగా ఆరుగురు డైరక్టర్స్ తో మీటింగ్ లలో పాల్గొన్నారని తెలిసింది. మహేష్ కు ఉన్న డెడికేషన్, వర్క్ కల్చర్ తోనే ఇది సాధ్యమైందంటున్నారు. ఆ ఆరుగురు డైరక్టర్స్ ఎవరూ అంటే...

అందుతున్న సమాచారం మేరకు మొదట సర్కారు వారి పాట దర్శకుడు పరుశరాం బుజ్జితో  కొన్ని సీన్స్ గురించి డిస్కషన్ చేసారట.  ఆ తర్వాత త్రివిక్రమ్ తో మాట్లాడారట. ఆయన దర్శకత్వంలో చేయబోయే చిత్రం కథ, ఎనౌన్సమెంట్ గురించిన మాటలు జరిగాయట. ఈ మీటింగ్ చాలా సేపు జరిగిందని అంటున్నారు. డిటేల్స్ గా కథ గురించి ఇద్దరు డిస్కస్ చేసారని, ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ పాత్ర గురించి చాలా ఎగ్జైట్ అయ్యారని అంటున్నారు.

ఆ తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా తోనూ, గోపిచంద్ మలినేనితోనూ మహేష్ బాబు క్యాజువల్ గా మాట్లాడారని అంటున్నారు. వారితో మరి సినిమాలు చేయటానికా లేక వేరే విషయాలు గురించి కలిసారా అన్నది తెలియరాలేదు. ఇక ఆ తర్వాత అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగాతో ఓ సబ్జెక్టు గురించి డిస్కస్ చేసారంటున్నారు. చాలా కాలంగా వీరిద్దిరి కాంబినేషన్ గురించి మాట్లాడుకుంటున్నదే. 

ప్రస్తుతం "ఆర్ఆర్ఆర్" సినిమాతో బిజీగా ఉన్న రాజమౌళి ఈ సినిమా పూర్తయిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే. జేమ్స్ బాండ్ లాంటి ఒక కథని రాజమౌళి మహేష్ బాబు తో తీయబోతున్నాడని రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రాజమౌళి ఒక ఇంగ్లీష్ నవల హక్కులను కూడా కొనుకున్నట్లు కొందరు చెప్పుకొచ్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబుతో చేయాల్సిన సినిమా కోసం ఇంకా రాజమౌళి ఏ కథను ఎంపిక చేయలేదట. నిజానికి రాజమౌళి మరియు మహేష్ బాబు మధ్య కథకి సంబంధించి చర్చలు జరిగాయి. కానీ అందులో ఏ ఒక్కటి కూడా మహేష్ కి నచ్చకపోవడంతో ఒక స్టోరీ రెడీ చేయమని రాజమౌళితో చెప్పారట. ఈ నేపథ్యంలోనే కథా రచయిత విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథ కోసం వర్క్ చేస్తున్నారు.

click me!