లహరి, శ్రీరామ్‌ల పెళ్లి చెడగొట్టేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్న మానస్‌, హమీద.. సీక్రెట్‌ టాస్కేంటి?

Published : Sep 22, 2021, 12:10 AM IST
లహరి, శ్రీరామ్‌ల పెళ్లి చెడగొట్టేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్న మానస్‌, హమీద.. సీక్రెట్‌ టాస్కేంటి?

సారాంశం

నామినేషన్ల(nominations) ప్రక్రియ పూర్తవగానే ఫన్నీ గేమ్‌కి తెరలేపాడు బిగ్‌బాస్‌(biggboss5). `హైదరాబాద్‌ అమ్మాయి, అమెరికా అబ్బాయి` అనే కెప్టెన్సీ టాస్క్ తో ఫన్‌ క్రియేట్‌ చేశాడు. ఇందులో అమెరికా అబ్బాయిగా శ్రీరామ చంద్ర(sreeram chandra), హైదరాబాద్‌ అమ్మాయిగా లహరి(lahari) నటిస్తారు.

మంగళవారం బిగ్‌బాస్‌ 5 షోలో అంతే హాట్‌గా, అంతే ఫన్నీగా సాగింది. ఫన్, హీట్‌ సమపాళ్లతో సాగిందని చెప్పొచ్చు. ఓ వైపు నామినేషన్ల ప్రక్రియలో ఇంటిసభ్యులు ఆరోపణలతో హౌజ్‌ మొత్తం హీటెక్కిపోయింది. నామినేషన్ల ప్రక్రియ పూర్తవగానే ఫన్నీ గేమ్‌కి తెరలేపాడు బిగ్‌బాస్‌. `హైదరాబాద్‌ అమ్మాయి, అమెరికా అబ్బాయి` అనే కెప్టెన్సీ టాస్క్ తో ఫన్‌ క్రియేట్‌ చేశాడు. ఇందులో అమెరికా అబ్బాయిగా శ్రీరామ చంద్ర, హైదరాబాద్‌ అమ్మాయిగా లహరి నటిస్తారు. వీరిద్దరికి పెళ్లి చేయాలనేది కాన్సెప్ట్. ఇందులో మానస్‌.. లహరి ఎదురింటి అబ్బాయి. ఆమెని ఇష్టపడే క్యారెక్టర్‌. ఇక హమీద.. శ్రీరామ్‌ ఎక్స్ లవర్. 

లహరి అమ్మగా అనీ మాస్టర్‌, తండ్రిగా నటరాజ్‌ మాస్టర్‌, మతిమరుపు మామగా యాంకర్‌ రవి, తమ్ముడిగా జెస్సీ నటించారు. అలాగే అబ్బాయి తరపున శ్రీరామ్‌కి తల్లిగా ప్రియా, ఫ్రెండ్స్ గా విశ్వ, బిజినెస్‌ పార్టనర్‌, ఫ్రెండ్‌గా విశ్వ నటించారు. షణ్ముఖ్‌ పెళ్లిళ్ల బ్రోకర్‌. లోబో ఈవెంట్‌ మేనేజర్‌, స్వేత వర్మ లోబో అసిస్టెంట్‌. కాజల్‌ శ్రీరామ్‌ సిస్టర్‌. అయితే లహరి కోసం అమెరికా నుంచి వస్తాడు శ్రీరామ్‌. పెళ్లి కుదిర్చేందుకు షణ్ముఖ్‌ బాగా ట్రై చేస్తుంటాడు. కానీ లహరిని ఇష్టపడే మానస్‌.. ఎంత ఖర్చైనా చేసి ఈ పెళ్లి క్యాన్సిల్‌ చేయాలని ప్లాన్‌ చేస్తుంటాడు. 

ఇక ప్రియుడి పెళ్లి వార్త తెలిసిన హమీద సైతం హైదరాబాద్‌ వచ్చి ఆయన పెళ్లిని రద్దు చేయించే ప్లాన్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలో పుట్టే ఫన్‌ కడుపుబ్బ నవ్విస్తుంది. సన్నీ కాజల్‌ల మధ్య, సన్నీ, ప్రియాంక ల మధ్య వచ్చే సన్నివేశాలు సైతం కామెడీని పంచాయి. ఈ టాస్క్ హౌజ్‌లో ఫన్‌ని క్రియేట్‌ చేస్తుంది. ఇక నెక్ట్స్ బిగ్‌బాస్‌.. యాంకర్‌ రవికి సీక్రెట్‌ టాస్క్ ఇస్తాడు. సీక్రెట్‌ కెప్టెన్సీ టాస్క్ లో యాంకర్‌ రవి ఏం చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు