ఒకే పిక్ లో ఘట్టమనేని హీరోలు.. అన్నయ్యకు బర్త్ డే విషెస్ తెలిపిన మహేష్

pratap reddy   | Asianet News
Published : Oct 14, 2021, 10:44 AM IST
ఒకే పిక్ లో ఘట్టమనేని హీరోలు.. అన్నయ్యకు బర్త్ డే విషెస్ తెలిపిన మహేష్

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్లడ్ రిలేషన్ పై మహేష్ బాబుకి మక్కువ ఎక్కువ.

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్లడ్ రిలేషన్ పై మహేష్ బాబుకి మక్కువ ఎక్కువ. తన జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మహేష్ మొదట చెప్పేది తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గురించే. అలాగే తన అన్నయ్య రమేష్ బాబు ప్రభావం కూడా తనపై ఉందని మహేష్ తరచుగా చెబుతుంటాడు. 

ఇదిలా ఉండగా బుధవారం రోజు Ramesh Babu 56వ జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. SuperStar Krishna పెద్ద కుమారుడైన రమేష్ బాబు టాలీవుడ్ లో కొన్నేళ్లపాటు హీరోగా రాణించాడు. ఆ తర్వాత కొన్ని పరాజయాల కారణంగా సినీ కెరీర్ ఆగిపోయింది. 

Also Read: 'మహా సముద్రం' ప్రీమియర్ షో టాక్

తన సోదరుడి బర్త్ డే సందర్భంగా Mahesh Babu సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపాడు. 'నా జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసిన వ్యక్తి, నేను ఎప్పటికి గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి.. నా అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు' అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. తన తండ్రి, సోదరుడు రమేష్ బాబుతో కలసి ఉన్న మెమొరబుల్ పిక్ ని మహేష్ షేర్ చేశాడు.

బజార్ రౌడీ చిత్రంలో రమేష్ బాబుతో మహేష్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అలాగే రమేష్ బాబు అర్జున్, అతిథి లాంటి మహేష్ సినిమాలకు నిర్మాతగా కూడా చేశారు. రమేష్ బాబు హీరోగా రాణించకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని.. సరైన కథలు ఎంచుకోకపోవడం ఓ కారణం అని కృష్ణ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వరుసగా పరాజయాలు ఎదురైన తర్వాత రమేష్ కి  నటించలేను ఆసక్తి పోయిందని చెప్పుకొచ్చారు. 

 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు