విషాదం.. ఫిట్ నెస్ ట్రైనర్ ఆకస్మిక మృతి, గురువుని కోల్పోయిన స్టార్ హీరో

pratap reddy   | Asianet News
Published : Oct 14, 2021, 08:40 AM ISTUpdated : Oct 14, 2021, 08:41 AM IST
విషాదం.. ఫిట్ నెస్ ట్రైనర్ ఆకస్మిక మృతి, గురువుని కోల్పోయిన స్టార్ హీరో

సారాంశం

చిత్ర పరిశ్రమలో అప్పుడప్పుడూ ఊహించని విషాద సంఘటనలు జరుగుతుంటాయి. స్టార్ సెలెబ్రిటీలు తమ ఆప్తులని కోల్పోతుంటారు. తాజాగా అలాంటి సంఘటనే బాలీవుడ్ లో జరిగింది.

చిత్ర పరిశ్రమలో అప్పుడప్పుడూ ఊహించని విషాద సంఘటనలు జరుగుతుంటాయి. స్టార్ సెలెబ్రిటీలు తమ ఆప్తులని కోల్పోతుంటారు. తాజాగా అలాంటి సంఘటనే బాలీవుడ్ లో జరిగింది. బాలీవుడ్ సెలెబ్రిటీలకు ఫిట్ నెస్ ట్రైనర్ గా పని చేస్తూ మంచి మనసున్న వ్యక్తిగా గుర్తింపు పొందిన కైజాద్ కపాడియా బుధవారం ఆకస్మిక మృతి చెందారు. 

కైజాద్ ఆకస్మిక మరణం బాలీవుడ్ ని షాక్ కి గురి చేసింది. అతడి కుటుంబ సభ్యులు స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. కైజాద్ మృతి స్టార్ హీరో Tiger Shroff కి గ్రేట్ లాస్ అని చెప్పాలి. టైగర్ ష్రాఫ్ కండలు తిరిగిన దేహంతో సూపర్ ఫిట్ గా ఉన్నాడంటే అందుకు కారణం Kaizad kapadia. టైగర్ ష్రాఫ్ నిత్యం కైజాద్ వద్ద ఫిట్ నెస్ మెళుకువలు నేర్చుకుంటూ ఉంటాడు. అతడి ఫిట్ నెస్ సలహాలు పాటిస్తాడు. అందుకే కైజాద్ ని టైగర్ ష్రాఫ్ తన గురువుగా భావిస్తాడు అని బాలీవుడ్ సెలెబ్రిటీలు అంటున్నారు. 

కైజాద్ మరణవార్త తెలుసుకున్న టైగర్ తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో 'రెస్ట్ ఇన్ పవర్ కైజాద్ సర్' అని టైగర్ ష్రాఫ్ పోస్ట్ పెట్టాడు. వైరల్ భయాని కూడా ట్వీట్ చేశాడు. ఫిట్ నెస్ ఫీల్డ్ లో కైజాద్ ఒక లెజెండ్ అని అభివర్ణిస్తున్నారు. తాను స్టార్ సెలెబ్రటీల ఫిట్ నెస్ ట్రైనర్ అనే గర్వాన్ని కైజాద్ ఎప్పుడూ తలకు ఎక్కించుకోలేదు. 

Also Read: నాగార్జున ఆశలన్నీ పూజా హెగ్డే పైనే.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇన్ సైడ్ టాక్ ఏంటి?

అయితే కైజాద్ ఆకస్మిక మరణానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ఆయన అంత్యక్రియలు పూణేలో జరగనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ప్రముఖులు, కైజాద్ స్నేహితులు ముంబై నుంచి పూణేకి వెళ్లి కైజాద్ కు నివాళులు అర్పించనున్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి