ఈ సినిమాకి సంబంధించి టైటిల్ కృష్ణ బర్తడే నాడు మే 31 వ తారీకు నాడు విడుదల చేసే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నారని చెప్తున్నారు.
రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకులను అలరించారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు. ఇప్పుడు ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. రాధకృష్ణ నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.. ఇందులో మహేష్ సరసన పూజా హేగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ అసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతొంది. అదే ఈ చిత్రం టైటిల్ .
గతంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో… అతడు, ఖలేజా వచ్చాయి. దాంతో మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి టైటిల్ కృష్ణ బర్తడే నాడు మే 31 వ తారీకు నాడు విడుదల చేసే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నారని చెప్తున్నారు. అయితే మూడు అక్షరాల పేర్లు కలిగిన సినిమాలు దాదాపు మహేష్ కి సూపర్ హిట్ లు కావటంతో.. మూడు అక్షరాల పేరుతో ఆ అనే అక్షరం తో స్టార్ట్ అయ్యే టైటిల్ పెట్టడానికి త్రివిక్రమ్ రెడీ అయినట్లు ఇండస్ట్రీలో టాక్.
మహేష్ కి మూడు అక్షరాలు సెంటిమెంట్ ఏవిధంగా ఉందో త్రివిక్రమ్ గత కొంత కాలం నుండి ఆ అక్షరం టైటిల్ తో సినిమాలు చేస్తూ వస్తున్నారు. దీంతో ఇప్పుడు మహేష్ కి కూడా అదే సెంటిమెంట్ రిపీట్ చేయటానికి త్రివిక్రమ్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ ‘అ’ సెంటిమెంట్‌ను అనుసరించి ఈ చిత్రానికి ‘అర్జునుడు’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అలాగే, ఒక్కడు మరియు దూకుడులో అజయ్ లాగా ఎతో మొదలయ్యే పాత్రల పేర్లకు మహేష్ బాబు కూడా అభిమాని.
ప్రస్తుతం, త్రివిక్రమ్ పూర్తిగా ఈ చిత్రం “ఫస్ట్ లుక్” పోస్టర్ డిజైన్‌లపై పని చేస్తున్నాడని వినికిడి. పోస్టర్‌ను ఖరారు చేసి, దాని కోసం BGM ట్రాక్‌ను పొందిన తర్వాత, మోషన్ పోస్టర్‌ను యానిమేట్ చేయడం కోసం అతను దానిని విజువల్ ఎఫెక్ట్స్ కు పంపుతాడు. అయితే ఈ టైటిల్ కు మహేష్ నుంచి మద్దతు వచ్చిందా... మహేష్ బాబు అర్జునుడుగా మారతాడా లేదా అనేది వేచి చూడాలి.
మరో ప్రక్క ఈ మూవీని దర్శకుడు త్రివిక్రమ్ మల్టీస్టారర్ గా రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. . సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాల్లో చిన్న పాత్రలకు కూడా పెద్ద ఆర్టిస్టులను తీసుకుంటాడు. త్రివిక్రమ్ సినిమాల్లో గెస్ట్ రోల్ చేయడానికి హీరోలు కూడా ఇష్టపడుతుంటారు.. అయితే ఇప్పుడు ఈ సినిమాలో కీ రోల్ కోసం నేచురల్ స్టార్ నానిని సంప్రదించినట్టుగా వార్త వైరల్ అవుతోంది. ఓ వైపు త్రివిక్రమ్, మరో వైపు మహేష్ బాబు కావడంతో నాని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. స్క్రీప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యాక దీనిపైన అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇందులో మలయాళం నటులు కూడా నటిస్తున్నట్టుగా టాలీవుడ్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న మూడో చిత్రమిది.. మహేష్ కి ఇది 28 చిత్రం కావడం విశేషం.