
శర్వానంద్ లేటెస్ట్ మూవీ శ్రీకారణం. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వానంద్ యువ రైతు పాత్ర చేస్తున్నారు. రైతుగా శర్వానంద్ లుంగీ లుక్ కి ప్రశంసలు దక్కాయి. షూటింగ్ చివరి దశకు చేరుకున్న శ్రీకారం మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. మార్చ్ 11న శివరాత్రి కానుకగా శ్రీకారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీజర్ విడుదలకు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేశారు.
ఫిబ్రవరి 9న సాయంత్రం 4:05 నిమిషాలకు శ్రీకారం టీజర్ విడుదల కానుంది. కాగా సూపర్ స్టార్ మహేష్ శ్రీకారం టీజర్ విడుదల చేయడం విశేషం. శ్రీకారం టీజర్ మహేష్ చేతుల మీదుగా విడుదల కావడం సినిమాకు మంచి ప్రచారం తెచ్చిపెట్టింది. శ్రీకారం మూవీలో శర్వానంద్ కి జంటగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నారు.
దర్శకుడు బి కిషోర్ శ్రీకారం సినిమాను తెరకెక్కిస్తుండగా, 14 ప్లస్ రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఇక విజయాల పరంగా వెనుకబడిన శర్వానంద్ ఈ చిత్రంపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. శ్రీకారం హిట్ కొట్టి ట్రాక్ లోకి రావాలని ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మహానుభావుడు మూవీ తరువాత శర్వానంద్ నటించిన సినిమాలు ఆశించినంతగా విజయం సాధించలేదు.