ప్రియుడితో కారులో వెళుతూ కెమెరా కంటికి చిక్కిన కియారా అద్వానీ!

Published : Feb 08, 2021, 04:38 PM IST
ప్రియుడితో కారులో వెళుతూ కెమెరా కంటికి చిక్కిన కియారా అద్వానీ!

సారాంశం

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తన పిల్లల బర్త్ డే పార్టీ నిర్వహించారు. ఈ వేడుకకు బాలీవుడ్ కి చెందిన ప్రముఖులను ఆహ్వానించడం జరిగింది. కియారా, సిద్దార్థలను కూడా ఆయన ఆహ్వానించగా కలిసి హాజరయ్యారు. సిద్ధార్థ్ మరియు కియారా ఒకే కారులో కరణ్ జోహార్ ఇంటికి చేరుకున్నారు.   

హీరోయిన్ కియారా అద్వానీపై చాలా కాలంగా ఎఫైర్ రూమర్స్ వస్తున్నాయి. బాలీవుడ్ యువ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఆమె ప్రేమాయణం నడుపుతున్నారనేది బాలీవుడ్  మీడియా వాదన. అయితే ఈ విషయంపై కియారా కానీ సిద్దార్థ్ కానీ స్పందించలేదు. తరచుగా వీరిద్దరూ ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపిస్తూ ఉంటారు. తాజాగా మరోమారు కియారా అద్వానీ, సిద్దార్ధ్ మల్హోత్రా కెమెరా కంటికి చిక్కారు. ఓ పార్టీకి వీరిద్దరూ కలిసి వెళ్లడం జరిగింది. 

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తన పిల్లల బర్త్ డే పార్టీ నిర్వహించారు. ఈ వేడుకకు బాలీవుడ్ కి చెందిన ప్రముఖులను ఆహ్వానించడం జరిగింది. కియారా, సిద్దార్థలను కూడా ఆయన ఆహ్వానించగా కలిసి హాజరయ్యారు. సిద్ధార్థ్ మరియు కియారా ఒకే కారులో కరణ్ జోహార్ ఇంటికి చేరుకున్నారు. 

తెలుగులో కియారా రెండు సినిమాలు చేయగా అందరికీ సుపరిచితమే. మహేష్ బాబు దర్శకుడు కొరటాల దర్శకత్వంలో చేసిన భరత్ అనే నేను మూవీలో కియారా హీరోయిన్ గా నటించారు. అలాగే చరణ్ కి జంటగా వినయ విధేయ రామ చిత్రం చేశారు. ప్రస్తుతం కియారా బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్నారు. దీనితో ఆమె టాలీవుడ్ పై ఫోకస్ తగ్గించారు. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే