`బింబిసార2` నుంచి వశిష్ట ఔట్‌.. ఇంతకి సీక్వెల్‌ ఉంటుందా?

Published : Mar 14, 2023, 11:05 AM IST
`బింబిసార2` నుంచి వశిష్ట ఔట్‌.. ఇంతకి సీక్వెల్‌ ఉంటుందా?

సారాంశం

కళ్యాణ్‌ రామ్‌ హీరోగా రూపొందిన `బింబిసార` పెద్ద విజయం సాధించింది. దీంతో సీక్వెల్‌పై బజ్‌ ఏర్పడింది. కానీ సీక్వెల్‌ నుంచి దర్శకుడిని తప్పించాడనే వార్త ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తుంది.

కళ్యాణ్‌ రామ్‌కి చాలా రోజుల తర్వాత సక్సెస్‌ ఇచ్చి నిలబెట్టిన చిత్రం `బింబిసార`. వశిష్ట మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కళ్యాణ్‌ రామ్‌ నిర్మించారు. గతేడాది విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. కళ్యాణ్‌ రామ్‌కి పెద్ద ఊరటనిచ్చింది. ఆ తర్వాత ఆయన్నుంచి వచ్చిన `అమిగోస్‌` షాకిచ్చింది. ఈ చిత్రం ఇటీవల విడుదలై దారుణంగా పరాజయం చెందింది. ఇదిలా ఉంటే `బింబిసార` సమయంలోనే సీక్వెల్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమా ఎండ్‌ కార్డ్ లో హింట్‌ కూడా ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమాని ఓ ఫ్రాంఛైజీలా చేయాలనుకుంటున్నట్టు దర్శకుడు వశిష్ట తెలిపారు.

ఇటీవల `బింబిసార 2`పై అప్‌డేట్‌ ఇచ్చారు కళ్యాణ్‌ రామ్‌. `అమిగోస్‌` ప్రమోషన్స్ సమయంలో ఆయన రియాక్ట్ అయ్యారు. ఈ ఏడాది చివర్లో ఉంటుందన్నారు. ప్రస్తుతం ఆయన `డెవిల్‌` సినిమా చేస్తున్నట్టు చెప్పారు. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా `బింబిసార2`పై రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దర్శకుడిని తప్పించారని, దర్శకుడు తప్పుకున్నాడనే పుకార్లు ఊపందుకున్నాయి. అయితే ఈ సీక్వెల్‌ నుంచి వశిష్ట తప్పుకున్నారనేది నిజమే అని తెలుస్తుంది. ఆయన తప్పించబడ్డారనేది కూడా నిజమే అంటున్నారు.

`బింబిసార` విజయం తర్వాత వశిష్ట.. ఇతర హీరోలకు కథలు చెప్పారు. అటు సినిమా నచ్చిన బాలయ్యకి ఓ కథ చెప్పాడు. ఆయన ఆసక్తిని వ్యక్తం చేశాడట. ఆయనతోపాటు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూడా ఓ కథ నెరేట్‌ చేశాడట. రజనీ సైతం తన ఇంట్రెస్ట్‌ ని తెలియజేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయాలు కళ్యాణ్‌ రామ్‌ అండ్‌ టీమ్‌కి తెలియకుండా జరిగింది. ఓ వైపు `బింబిసార2` చేయాల్సి ఉండగా, ఇతర హీరోలకు కథ చెప్పడంతో వీరి మధ్య ఏర్పడిన మనస్పర్థాల కారణంగా దర్శకుడు వశిష్టని తప్పించారని, తనపై టీమ్‌ రియాక్ట్ అయిన తీరుకి తను తప్పుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా `బింబిసార2`కి నుంచి వశిష్ట ఔట్‌ అనేది నిజమని అంటున్నారు. 

అయితే దర్శకుడిని తప్పించడంలో మరో కారణం కూడా ఉందని తెలుస్తుంది. సీక్వెల్‌ని అయితే ప్రకటించారు గానీ, దానికి స్క్రిప్ట్ లేదు. ఆ హైప్‌ కోసం సీక్వెల్‌ ప్రకటించారు గానీ, అసలు సీక్వెల్‌కి కథే లేదని టాక్‌. ఆ స్క్రిప్ట్ పై ఫోకస్‌ చేయకుండా ఇతర హీరోల వెంటపడటం కళ్యాణ్‌ రామ్‌ టీమ్‌కి నచ్చలేదని, అందుకే తప్పించబడ్డాడని టాక్‌. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త చాలా రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే వశిష్ట స్థానంలో `బింబిసార2`కి మరో దర్శకుడిని ఫైనల్‌ చేశారని టాక్‌. అనిల్‌ పాడూరిని దర్శకుడిగా ఫిక్స్ చేశారని తెలుస్తుంది. కానీ కథలేకపోవడంతో ఈ సీక్వెల్‌ ఉంటుందా, ఆటకెక్కుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..
500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా