Mahesh Babu: 'వాట్స్ హ్యాపెనింగ్' అంటూ వచ్చేసిన మహేష్.. తన భార్య ట్విట్టర్ లోకి రావాలట

Published : May 10, 2022, 02:24 PM ISTUpdated : May 10, 2022, 02:25 PM IST
Mahesh Babu: 'వాట్స్ హ్యాపెనింగ్' అంటూ వచ్చేసిన మహేష్.. తన భార్య ట్విట్టర్ లోకి రావాలట

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం మే 12న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం మే 12న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పోకిరి, దూకుడు తర్వాత మహేష్ బాబు మాస్ లుక్ లో.. కామెడీ టైమింగ్ అదరగొడుతూ కనిపిస్తున్న చిత్రం ఇదే. 

ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. స్వయంగా మహేష్ బాబు రంగంలోకి దిగి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. తాజాగా మహేష్ బాబు నుంచి చిన్న పాటి సర్ ప్రైజ్ వచ్చింది. 'వాట్స్ హ్యాపెనింగ్' అంటూ మహేష్ బాబు ట్విట్టర్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ వీడియో రిలీజ్ చేశాడు. 

పలు సరదా ప్రశ్నలకు మహేష్ సమాధానం ఇచ్చారు. హ్యాష్ ట్యాగ్ లో మీ గురించి మీరు చెప్పండి అనే ప్రశ్నకు 'కామ్ అండ్ కంపోజ్డ్ ' అని సమాధానం ఇచ్చారు. ఎమోజిలో తన గురించి వివరించాల్సి వస్తే 'స్మైలీ' అని సమాధానం ఇచ్చారు. 

ట్విట్టర్ లో ఒకే ఒక వ్యక్తిని ఫాలో కావాలి అంటే ఎవరిని ఎంచుకుంటారు అనే ప్రశ్నకు.. నా భార్య ట్విట్టర్ లోకి వస్తే బావుంటుంది అని మహేష్ బాబు సమాధానం ఇచ్చారు. 

ఒక్కడు సినిమాలో ఫాలో కావాలి అనిపించే క్యారెక్టర్, మ్యూట్, బ్లాక్ చేయాలి అనిపించే క్యారెక్టర్స్ ఏవి అనే ప్రశ్నకు.. స్వప్న పాత్రని ఫాలో కావాలి, తన తండ్రిగా నటించిన ముఖేష్ రుషి పాత్రని మ్యూట్ చేయాలని, ప్రకాష్ రాజ్ ఓబుల్ రెడ్డి పాత్రని బ్లాక్ చేయాలని అన్నారు. 

చివరగా సర్కారు వారి పాట గురించి చెప్పండి అని అడగగా.. ఈ సమ్మర్ లో నా ఫ్యాన్స్ బ్లాస్ట్ ని ఎంజాయ్ చేబోతున్నారు అని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా