వెనక్కి తగ్గనంటున్న మహేష్, 'RRR' కు అడ్డం పడుతుందా?

By Surya PrakashFirst Published Oct 19, 2021, 12:37 PM IST
Highlights

ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటించిన 'RRR' సినిమాని జనవరి 7 రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించటంతో సంక్రాంతి సినీ మొదలైపోయింది. అయితే ఈ సినిమా  రిలీజ్ డేట్  ఇవ్వకముందే మహేష్ బాబు - ప్రభాస్ - పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు సంక్రాంతి బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. 

 సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై నెవర్ బిఫోర్ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ చేసిన గత మూడు చిత్రాలు ఒకదాన్ని మించి ఒకటి భారీ హిట్ కావడంతో ఇక నెక్స్ట్ హ్యాట్రిక్ దీనితోనే మొదలవ్వాలని సాలిడ్ గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడనేది ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటించిన 'RRR' సినిమాని జనవరి 7 రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించటంతో సంక్రాంతి సినీ మొదలైపోయింది. అయితే ఈ సినిమా  రిలీజ్ డేట్  ఇవ్వకముందే మహేష్ బాబు - ప్రభాస్ - పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు సంక్రాంతి బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఫెస్టివల్ బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ తప్పనిసరి అయ్యింది. అయితే ఈ పోటిలో ఎందుకని సర్కారు వారి పాట సినిమా ఉగాది రిలీజ్ పెట్టుకోబోతుందని మీడియాలో వార్తలు మొదలయ్యాయి. అయితే అలాంటిదేమీ లేదని సంక్రాతికే మహేష్ బాబు థియోటర్స్ లో దిగబోతున్నట్లు సమాచారం. మొదట చెప్పినట్లుగానే జనవరి 13న సర్కారు వారి పాట హంగామా చేయబోతోందిట. దాంతో ఇప్పుడు ఈ చిత్రం  'RRR' కలెక్షన్స్ కు అడ్డం  పడుతుందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
వాస్తవానికి  'సర్కారు వారి పాట' చిత్రాన్ని జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు కరోనా ఫస్ట్ వేవ్ టైం లోనే అనౌన్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుంచి టీజర్ వరకూ అన్నిట్లో సంక్రాంతి రిలీజ్ అని చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు RRR రాకతో మహేష్ సినిమా విడుదలను 2022 సమ్మర్ కి వాయిదా చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు మహేష్ బాబును రాజమౌళి ఇప్పటికే ఒప్పించాడని చెబుతున్నారు. కానీ అవేమీ నమ్మాల్సిన పనిలేదని, తమ సినిమా ఇంకా వెనక్కి వెళ్తే ఆలస్యం అయ్యిపోతుందని మహేష్ నిర్మాతలు భావిస్తున్నారట.

Also read అమెరికాకు సిద్దమైన వంటలక్క, డాక్టర్ బాబు.. సడన్ ఎంట్రీ ఇచ్చిన విహారి?

మరో ప్రక్క సంక్రాంతికి  థియేటర్లలోకి రానున్న సినిమాల క్లాష్ పై చర్చించడానికి చిత్ర పరిశ్రమ ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేసిందని వార్తలు వస్తున్నాయి. దాంతో  త్వరలోనే విడుదల తేదీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 

వరుసగా ''భరత్ అనే నేను, మహర్షి'' సినిమాలతో సత్తా చాటిన సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకుంటూ హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇదే బాటలో 'సర్కారు వారి పాట' అంటూ మరో వైవిద్యభరితమైన కథను ఓకే చేసిన మహేష్.. ఇంకా ఈ సినిమా షూటింగ్ మొదలుకాకముందే రికార్డుల సునామీ సృష్టిస్తున్నారు. సోషల్ మీడియా ఖాతాల్లో 'సర్కారు వారి పాట' మోత మోగిస్తూ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నారు 

Also read Bigg boss telugu 5: నామినేషన్స్ లో ఆ ఏడుగురు... రవి, శ్రీరామ్, ప్రియలతో పాటు టాప్ కంటెస్టెంట్స్
 
మరో ప్రక్క  “సర్కారు వారి పాట” బిజినెస్ పూర్తైపోయిందిట.  ఓ స్దాయి రేట్లకే  థియేట్రికల్ రైట్స్ అమ్మేసారని తెలుస్తుంది.  దాంతో నిర్మాతలు పండుగ చేసుకుంటున్నారట. ఈ చిత్రంలో  మహేష్ బాబు హీరోగా నటించడమే గాక చిత్ర నిర్మాణంలోనూ భాగస్వామ్యం పంచుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

click me!