మహేష్, అజిత్ ధాటికి కనిపించని బాలీవుడ్!

Published : Aug 23, 2019, 03:08 PM IST
మహేష్, అజిత్ ధాటికి కనిపించని బాలీవుడ్!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా విడుదలైతే సోషల్ మీడియాలో హంగామా ఎలా ఉంటుందో మరోసారి రుజువైంది. సూపర్ స్టార్ మహేష్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం ఈ ఏడాది సమ్మర్ లో విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా విడుదలైతే సోషల్ మీడియాలో హంగామా ఎలా ఉంటుందో మరోసారి రుజువైంది. సూపర్ స్టార్ మహేష్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం ఈ ఏడాది సమ్మర్ లో విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకుడు. 

ఇదిలా ఉండగా మహర్షి చిత్రం అరుదైన ఘనత సాధించింది. ఈ ఏడాది జూన్ వరకు ఇండియాలో అత్యధికంగా ట్రెండింగ్ లో నిలిచిన ట్విటర్ హ్యాష్ ట్యాగ్ లలో 'మహర్షి' 4వ స్థానంలో నిలిచింది. వసూళ్ల పరంగా కూడా ఈ చిత్రం మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక మొదటి స్థానంలో అజిత్ నటించిన విశ్వాసం చిత్రం ట్రెండింగ్ లో నిలిచింది. ఇక రెండవ స్థానంలో 'లోక్ సభ ఎలక్షన్స్ 2019' హ్యాష్ ట్యాగ్ నిలిచింది. మూడవస్థానంలో 'క్రికెట్ వరల్డ్ కప్ 2019, ఐదవస్థానంలో 'న్యూ ప్రొఫైల్ పిక్' హ్యాష్ ట్యాగ్స్ నిలిచాయి. 

మొదటి ఐదు స్థానాల్లో ఒక్క బాలీవుడ్ చిత్రం కూడా కనిపించకపోవడం విశేషం. ఇటీవల ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సౌత్ చిత్రాల ప్రభావం పెరుగుతోంది. 

PREV
click me!

Recommended Stories

Thanuja: తనూజ అసలు రూపం బయట పడింది, బిగ్ బాస్ టైటిల్ గెలిచేందుకు అంతకి తెగించిందా ?
Nivetha Pethuraj పెళ్లి ఆగిపోయిందా? ఫోటోలు డిలీట్ చేసిన స్టార్‌ హీరోయిన్‌.. ఇదేం ట్విస్ట్