దర్శకులకు హాట్ బ్యూటీ కండిషన్

Published : Aug 23, 2019, 02:59 PM ISTUpdated : Aug 23, 2019, 03:36 PM IST
దర్శకులకు హాట్ బ్యూటీ కండిషన్

సారాంశం

టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టే అవకాశం ఇప్పుడున్న హీరోయిన్స్ కి చాలా కష్టమైపోయింది. సీనియర్ హీరోయిన్స్ హావా చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. అయితే ఇదే సమయంలో వరుసగా బడా ప్రాజెక్టులను ఏ మాత్రం మిస్ చేసుకోకుండా పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే బ్యూటీ కథలను ఎంచుకోవడంలో దర్శకులకు ఒక కండిషన్ పెడుతోందట. 

కథ చెప్పడానికి ముందే దర్శకులు ఎవరైనా సరే షూటింగ్ కి ఒక రోజు ముందే డైలాగ్స్ స్క్రిప్ట్ తనకు ఇవ్వాలని చెబుతోందట. షూటింగ్ కి వచ్చే ముందు రోజు డైలాగ్స్ పై ఓ లుక్కిస్తే తరువాత ఎలాంటి ఇబ్బంది ఉండదని తోటి నటీనటులతో ఈజీగా యాక్ట్ చేసేందుకు వీలుగా ఉంటుందని పూజా ఒక ఆ కండిషన్ పెడుతోందట. అందుకు కారణం తనకు తెలుగంటే చాలా ఇష్టమని వీలైనంత త్వరగా తెలుగు భాషను నేర్చుకోవాలనే ఆలోచన కూడా ఉన్నట్లు ఈ బ్యూటీ వివరణ ఇచ్చింది. 

ప్రస్తుతం పూజా అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆల వైకుంఠపురములో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రభాస్ జిల్ దర్శకుడు రాధాకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఈ బ్యూటీ నటిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Samantha: ఫస్ట్ నైట్‌ సీన్లు సమంత నేర్పించింది.. హీరోయిన్‌ ఓపెన్‌
అల్లు అర్జున్ కొంప ముంచిన అల్లు అరవింద్, కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్..పండగ చేసుకున్న స్టార్ హీరో కొడుకు