ఫ్యామిలీతో వెకేషన్ కి మహేష్ రెడీ!

By Udaya DFirst Published Apr 10, 2019, 11:03 AM IST
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీ పట్ల ఎంత శ్రద్ధగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీ పట్ల ఎంత శ్రద్ధగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమయం దొరికినప్పుడల్లా భార్య, పిల్లలతో కలిసి ఫారెన్ ట్రిప్ లకు వెళ్తుంటాడు. ఇప్పుడు కూడా తన ఫ్యామిలీతో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తున్నాడు.

ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమాకి సంబంధించిన పనులు ఏప్రిల్ 20నాటికి పూర్తవుతాయి. ఆ వెంటనే పది రోజుల పాటు కుటుంబంతో విదేశాలకు వెళ్లి సేదతీరాలని భావిస్తున్నాడు. తను నటించే సినిమా సినిమాకు మధ్య గ్యాప్ లో ఫ్యామిలీతో ట్రిప్ లకు వెళ్లడం మహేష్ కి అలవాటు.

అలా వెళ్లి అక్కడ తీసుకున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. అయితే ఈసారి ఎక్కడకి వెళ్లబోతున్నారనే విషయంలో క్లారిటీ లేదు. వెకేషన్ పూర్తయిన తరువాత 'మహర్షి' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనున్నాడు మహేష్. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది.

విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ల వ్యూస్ దక్కించుకొని యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలిచింది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను మే 9న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

click me!