ఆడబిడ్డ తండ్రిగా చాలా బాధపడ్డా, మహేష్ రియాక్షన్.. కొండా సురేఖ సమంతని అవమానించ లేదు అంటూ ఆర్జీవీ.. 

By tirumala AN  |  First Published Oct 3, 2024, 2:54 PM IST

అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకుల గురించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ ని విమర్శించే క్రమంలో కొండా సురేఖ.. కేటీఆర్ కి, సమంతకి ముడిపెడుతూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.


అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకుల గురించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ ని విమర్శించే క్రమంలో కొండా సురేఖ.. కేటీఆర్ కి, సమంతకి ముడిపెడుతూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు.. ఎన్ కన్వెన్షన్ ని కూల్చకుండా ఉండాలంటే సమంతని తన వద్దకు పంపాలని కేటీఆర్ అక్కినేని ఫ్యామిలీని బెదిరించారని.. దీనితో నాగార్జున సమంతని ఫోర్స్ చేశారని.. అందుకే సమంత అక్కినేని ఫ్యామిలీకి దూరంగా వెళ్ళిపోయింది అంటూ ఆమె విచిత్రమైన విమర్శలు చేశారు. సమంత, నాగ చైతన్య విడాకులకు కారణం కేటీఆర్ అంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. 

కొండా సురేఖ కామెంట్స్ పై భగ్గుమంటున్న టాలీవుడ్ 

కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా అక్కినేని ఫ్యామిలీ మాత్రమే కాదు సినీ లోకం మొత్తం భగ్గుమంటోంది. కొండా సురేఖని దుమ్మెత్తి పోస్తూ టాలీవుడ్ సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఎన్టీఆర్, నాని, చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి టాప్ హీరోలంతా సమంతకి మద్దతు ఇస్తూ కొండా సురేఖని తీవ్రంగా విమర్శిస్తున్నారు. 

మహేష్ బాబు రియాక్షన్ 

Latest Videos

undefined

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కొండా సురేఖ కామెంట్స్ పై స్పందించారు. మా సినిమా కుటుంబానికి చెందిన వ్యక్తుల గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు విని చాలా బాధపడ్డాను. ఒక మహిళా మంత్రి మరొక మహిళ పై చేసిన వ్యాఖ్యలు, వాడిన పదజాలం వల్ల ఒక ఆడబిడ్డ తండ్రిగా, ఒక మహిళకి భర్తగా, కొడుకుగా చూసి తట్టుకోలేకపోయా. మాట్లాడే స్వేచ్చకి కూడా హద్దు ఉంటుంది. ఇలాంటి చీప్ కామెంట్స్, బేస్ లెస్ కామెంట్స్ చేసిన మంత్రి వ్యాఖ్యలని ఖండిస్తున్నా. ప్రతి ఒక్కరికి చిత్ర పరిశ్రమ సాఫ్ట్ టార్గెట్ గా మారింది. మన దేశంలో మహిళలు గౌరవయింపబడాలి కానీ ఇలా అవమానాలకు గురి కాకూడదు అని మహేష్ పేర్కొన్నారు. 

క్షమాపణ చెప్పిన కొండా సురేఖ 

తన వ్యాఖ్యల వల్ల చాలా మంది బాధపడ్డారు.. అంతా తగలబడిపోతోంది అని తెలుసుకున్న కొండా సురేఖ స్పందిస్తూ సమంతకి సారీ చెప్పారు. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ  మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం  అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా..నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ  మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను.. అన్యద భావించవద్దు అని కొండా సురేఖ తన కామెంట్స్ ని వెనక్కి తీసుకున్నారు. 

అవమానించింది సమంతని కాదు అంటున్న ఆర్జీవీ 

అయితే ఈ వివాదంలో రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. కొండా సురేఖ గారు సమంతని అవమానించలేదు. ఇంకా చెప్పాలంటే సమంతని ఆమె పొగిడారు. కానీ ఆమె సమంతకు సారీ చెప్పడం ఆశ్చర్యంగా అనిపించింది. అసలు ఆమె అవమానించింది, దారుణంగా మాట్లాడింది నాగార్జున, నాగ చైతన్య గురించి. తమ ఆస్తులని కాపాడు కోవడం కోసం నాగార్జున, నాగ చైతన్య.. తమ కోడలు, భార్య అతడి దగ్గరకి వెళ్ళమని ఫోర్స్ చేశారు. సమంత ఆలా చేయనని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అని కొండా సురేఖ అన్నారు. ఇక్కడ సమంతకి అవమానం ఏం జరిగింది ? ఇక్కడ దారుణంగా అవమానానికి గురైంది నాగార్జున, చైతన్య. కానీ ఆమె వీళ్ళ గురించి మాట్లాడడం లేదు. ఒక మామని, భర్తని ఇంత దారుణంగా ఎవరూ అవమానించి ఉండరు.. ఇలాంటి ఆరోపణలు చేసి ఉండరు. కాబట్టి కొండా సురేఖపై తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి అని ఆర్జీవీ అన్నారు. 

టాలీవుడ్ సెలెబ్రిటీల రియాక్షన్ 

కొండా సురేఖగారు వ్యక్తిగత జీవితాలను బయటకులాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ. ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించేలా వ్యవహరించాలి. బాధ్యతారాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరం. ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చొనేది లేదు. ఒకరినొకరు గౌరవించుకోవడం, పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని కచ్చితంగా లేవనెత్తుతాం. ప్రజాస్వామ్య భారతంలో నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను మన సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించదు అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. 

‘‘రాజకీయ నాయకులు అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అసహ్యం వేస్తోంది.  బాధ్యత లేకుండా మీరు మాట్లాడుతున్న తీరు చూస్తే, మీ ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందా? అనిపిస్తోంది. ఇది కేవలం సినిమా నటులు, చిత్ర పరిశ్రమ, రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం మాత్రమే కాదు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సమాజంపై చెడు ప్రభావాన్ని చూపే ఇలాంటి చర్యలను అంతా ఖండించాలి’’ - నాని

‘‘జీవితంలో విడాకుల నిర్ణయమనేది అత్యంత బాధాకరమైన, దురదృష్టకర విషయాల్లో ఒకటి. ఎన్నో ఆలోచనల తర్వాత పరస్పర అంగీకారంతోనే నా మాజీ భార్య, నేను విడిపోయాం. ఎంతో పరిణితితో ఆలోచించి మా విభిన్న లక్ష్యాల కోసం ముందుకు సాగడానికి విడాకులు తీసుకున్నాం. మా విడాకులపై గతంలో అనేక నిరాధారమైన ఆరోపణలు వచ్చాయి. ఇరు కుటుంబాలపై ఉన్న గౌరవంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమే కాకుండా హాస్యాస్పదం. ఆమె వ్యాఖ్యలు ఆమోదనీయం కాదు. సమాజంలో మహిళలకు మద్దతుతో పాటు గౌరవం దక్కాలి. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల నిర్ణయాలను మీడియా హెడ్ లైన్స్ కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటు’’ అని నాగచైతన్య పేర్కొన్నారు. 

‘‘నా విడాకులు వ్యక్తిగత విషయం. దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నా. మహిళగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారు.. ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నా. దయచేసి చిన్న చూపు చూడకండి. ఓ మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను వేడుకుంటున్నా. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయి. ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు సామ్‌.

అల్లు అర్జున్ స్పందిస్తూ.. చిత్ర పరిశ్రమకి చెందిన కుటుంబాల గురించి, వ్యక్తుల గురించి ఇలాంటి బేస్ లెస్ కామెంట్స్ చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి వ్యాఖ్యలు, ప్రవర్తన తెలుగు సంస్కృతికి వ్యతిరేకం. ఇలాంటి చర్యలు ఎవరు చేసినా సహించకూడదు. ముఖ్యంగా ఆడవారి విషయంలో ఎంతో గౌరవంగా మెలగాలి. వారి ప్రైవసీని గౌరవించాలి అని ట్వీట్ చేశారు. 

గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉన్నాయి. వార్తల్లో హైలైట్ కావడం కోసం సినిమా పరిశ్రమని, సెలెబ్రిటీలని టార్గెట్ చేసి మాట్లాడడం సిగ్గు చేటు. సమాజానికి మేలు జరగాలని అందరూ నాయకులని ఎన్నుకుంటారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులపై, ముఖ్యంగా మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు చేయవద్దు అంటూ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 

ఏంటి సిగ్గులేని రాజకీయాలు. సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే అంత చిన్న చూపా అంటూ ప్రకాష్ రాజ్ కొండా సురేఖపై విమర్శలు చేశారు. 

 

 

click me!