ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మళ్ళీ బ్యాడ్ న్యూస్.. బాంబు పేల్చిన నిర్మాత, రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరాశే

By tirumala AN  |  First Published Oct 3, 2024, 2:06 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర చిత్రం ఇటీవల విడుదలైంది. మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది.


యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర చిత్రం ఇటీవల విడుదలైంది. మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం కావడంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. అయితే అంచనాలని పూర్తి స్థాయిలో ఈ చిత్రం అందుకోలేదు. కానీ కలెక్షన్లకు మాత్రం ఢోకా లేదు. 

సక్సెస్ సెలెబ్రేషన్స్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలు 

సెకండ్ హాఫ్ విషయంలో ప్రేక్షకులకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. కానీ చాలా అంశాలు కలసి రావడంతో దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. అయితే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండా విడుదలయింది. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మరో బ్యాడ్ న్యూస్. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలాగు జరగలేదు. కనీసం రిలీజ్ తర్వాత గ్రాండ్ గా సక్సెస్ సెలెబ్రేషన్స్ అయినా చేస్తారు అని ఫ్యాన్స్ భావించారు. కానీ ఇప్పుడు కూడా నిరాశే ఎదురైంది. నిర్మాత నాగ వంశీ బాంబు లాంటి వార్త చెబుతూ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశారు. 

Latest Videos

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్, సక్సెస్ సెలెబ్రేషన్స్ క్యాన్సిల్ 

దేవర చిత్రానికి సక్సెస్ సెలెబ్రేషన్స్ చేయడం లేదు అని తాజాగా ప్రకటించారు. నాగ వంశీ ఏపీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డ్స్ సాధించడంలో తోడ్పాటు అందించిన అభిమానులకు ధన్యవాదాలు. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదు కాబట్టి.. సక్సెస్ సెలెబ్రేషన్స్ ని తన అభిమానులతో కలసి గ్రాండ్ గా చేసుకోవాలని తారక్ అన్న భావించారు. దేవర సక్సెస్ సెలెబ్రేషన్స్ ని అవుట్ డోర్ ప్లేస్ లో గ్రాండ్ గా చేసేందుకు అనుమతుల కోసం ప్రయత్నించాం. కానీ దురదృష్టవ శాత్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుమతులు లభించలేదు. 

Also Read: చిరంజీవి, బన్నీలో ఉండే ఒక్క కామన్ క్వాలిటీ వల్లే టాప్ హీరోలు అయ్యారు..స్వయంగా మెగాస్టార్ చెప్పిన నిజం

దేవర సక్సెస్ సెలెబ్రేషన్స్ కి అనుమతి నిరాకరణ 

దేవి నవరాత్రులు, దసరా పండుగ సందర్భంగా అంత పెద్ద ఈవెంట్ కి అనుమతులు ఇవ్వడం కుదరదని పోలీసులు తెలిపారు. అనుమతులు లభించనప్పుడు మన చేతుల్లో ఏమీ ఉండదు. కాబట్టి సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించలేక పోతున్నందుకు అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాం అని నాగ వంశీ ట్వీట్ చేశారు. నిజంగా ఇది తారక్ ఫ్యాన్స్ కి బాంబు లాంటి వార్తే అని చెప్పొచ్చు. 

దేవర రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఊహించని విధంగా రద్దై ఫ్యాన్స్ కి నిరాశ కలిగించింది. హైదరాబాద్ నోవాటెల్ లో సెప్టెంబర్ 22న ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. అది ఇండోర్ కాబట్టి పరిమిత సంఖ్యలో మాత్రమే అభిమానులకు అవకాశం ఉంటుంది. కానీ ఇష్టానుసారం పాస్ లు ఇచ్చేయడంతో వేలాదిగా అభిమానులు అక్కడికి వచ్చారు. దీనితో హోటల్ లో ఆడియన్స్ కి ప్లేస్ సరిపోలేదు. అభిమానులని కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులు ఎత్తసారు. హోటల్ లో కొంత డ్యామేజ్ కూడా జరిగింది. దీనితో సడెన్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. ఇప్పుడు సక్సెస్ సెలెబ్రేషన్స్ ఈవెంట్ కూడా రద్దు కావడం ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశకి గురిచేసే అంశమే. 

డ్యూయెల్ రోల్ లో ఎన్టీఆర్ 

 ఇదిలా ఉండగా ఎన్టీఆర్ గత కొన్నేళ్ళుగా పరాజయం లేకుండా దూసుకుపోతున్నారు. నాన్నకు ప్రేమతో, టెంపర్, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ, ఆర్ఆర్ఆర్ ఇలా వరుస విజయాలు సాధించారు. ఇప్పుడు ఈ ఖాతాలోకి దేవర కూడా చేరింది.   కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కి దేవర చిత్రం రెండో మూవీ. గతంలో వీరిద్దరూ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ అనే చిత్రం వచ్చింది. ఆ మూవీ మంచి విజయం సాధించింది. ఇప్పుడు కొరటాల శివ ఎన్టీఆర్ పాన్ ఇండియా క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని సముద్రం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించారు. మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు.. చంపేంత ధైర్యం అక్కర్లేదు అనే పాయింట్ తో  సముద్రం బ్యాక్ డ్రాప్ లో దేవర కథ రాసుకున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరోసారి డ్యూయెల్ రోల్ లో నటించారు. గతంలో ఎన్టీఆర్ ఆంధ్రావాలా చిత్రంలో డ్యూయెల్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. 

click me!