''Selfie of Success'' పుస్తకానికి మహేష్ ప్రశంసలు!

Published : Aug 02, 2019, 12:42 PM IST
''Selfie of Success'' పుస్తకానికి మహేష్ ప్రశంసలు!

సారాంశం

ప్రముఖ సినీనటుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు ''Selfie of Success'' పుస్తకం ను చదివి తన అనుభవాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

తెలంగాణ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి శ్రీ బుర్రా వెంకటేశం గారు రచించిన ''Selfie of Success'' పుస్తకం ఇప్పటికే దేశ, విదేశాలలో ఎంతో మంది పుస్తక ప్రియుల విశేష ఆదరణ పొంది అమెజాన్ ఆన్ లైన్ అమ్మకాలలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

తాజాగా ప్రముఖ సినీనటుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు ''Selfie of Success'' పుస్తకం ను చదివి తన అనుభవాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ''Selfie of Success'' అనే పుస్తకమును ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం గా అభివర్ణించారు.

గెలుపు  తరువాత జరిగే పరిణామాల పై సమగ్రంగా చర్చించారని పేర్కొన్నారు మహేష్ బాబు. విజయం మనిషి జీవితంలో ఒక ప్రయాణంగా ఉండాలని వివరంగా తన  అభిప్రాయాలను వెల్లడించిన పుస్తక రచయిత బుర్రా వెంకటేశం గారికి అభినందనలు తెలిపారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల 'మహర్షి' సినిమా తో సక్సెస్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటిస్తున్నాడు. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ గా కనిపించనున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Sobhan Babu: కృష్ణ కోసమే నాకు అన్యాయం చేశారు, వాళ్ళ అంతు చూస్తా అంటూ కట్టలు తెంచుకున్న శోభన్ బాబు కోపం
Karthika Deepam 2 Today Episode: తప్పించుకున్న జ్యో- సుమిత్ర చావుకు ప్లాన్- దీపకు కూడా ఆపద రానుందా?