పవన్ కళ్యాణ్ స్పీచ్.. వైరల్ అవుతున్న మహేష్ ట్వీట్, బాగా సింక్ అవుతోంది..

pratap reddy   | Asianet News
Published : Sep 26, 2021, 02:42 PM IST
పవన్ కళ్యాణ్ స్పీచ్.. వైరల్ అవుతున్న మహేష్ ట్వీట్, బాగా సింక్ అవుతోంది..

సారాంశం

సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ చీఫ్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై శివమెత్తారు.

సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ చీఫ్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై శివమెత్తారు.  చిత్ర పరిశ్రమని ఇబ్బంది పెట్టేందుకే ఏపీ ప్రభుత్వం ఆన్లైన్ టికెట్ విధానాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. 

చిత్ర పరిశ్రమ పెద్దలు ఈ విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని ప్రాధేయపడవద్దని.. అది మన హక్కు అని సూచించారు. అవసరమైన తన సినిమాలు బ్యాన్ చేసి.. చిత్ర పరిశ్రమని వదిలేయాలని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ హీరోలకు హీరోయిన్లకు ఊరికే డబ్బులు రావని.. కష్టపడి డాన్సులు ఫైట్స్ చేస్తేనే డబ్బులు వస్తాయని అన్నారు. 

దీనితో తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలపాలని అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు పాత ట్వీట్ ఒకటి వైరల్ గా మారింది. దాదాపు పదేళ్ల క్రితం మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేసిన ట్వీట్ అది. ఆ ట్వీట్ ప్రస్తుత పరిస్థితులకు బాగా సింక్ అయ్యేలా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు పవన్ అభిమానులు. 

'పవన్ కళ్యాణ్ ఆడియో వేడుకలో ప్రసంగించిన స్పీచ్ గురించి కొంతమంది నాకు చెప్పారు. పవన్ చాలా బాగా మాట్లాడాడు. అందులో నాకు ఎలాంటి ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే నేను అతడిని ఇష్టపడే వ్యక్తిని' అంటూ మహేష్ బాబు చేసిన ట్వీట్ అది. 

కొమరం పులి చిత్ర ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ ప్రసంగం గురించి మహేష్ చేసిన ట్వీట్ గా తెలుస్తోంది. ఇప్పుడు కూడా మహేష్ బాబు పవన్ కి మద్దతు తెలుపుతూ ఏపీ ఆన్లైన్ టికెట్ విధానం గురించి ట్వీట్ చేయాలని అభిమానులు కోరుతున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

థాంక్యూ మై దోస్త్.. మహేష్ బాబు కు ప్రియాంక చోప్రా ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకో తెలుసా?
రామ్ చరణ్ పెద్ది కోసం మృణాల్ ఠాకూర్ ఐటమ్ సాంగ్..? రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటుందో తెలుసా?