`లవ్ స్టోరి` చూసిన మహేష్..స్పందన ఏంటంటే

Surya Prakash   | Asianet News
Published : Sep 26, 2021, 10:07 AM IST
`లవ్ స్టోరి` చూసిన మహేష్..స్పందన ఏంటంటే

సారాంశం

'శేఖర్‌ కమ్ముల చాలా బాగా తెరక్కెకించారు. నాగ చైతన్య నటుడిగా చాలా ఎదిగాడు. అతని ప‌ర్‌ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ సినిమా అతనికి గేమ్‌ చేంజర్‌ అవుతుంది. ఇక సాయిపల్లవి ఎప్పటిలాగే సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఈమెకు అసలు ఎముకలు ఉన్నాయా అన్న సందేహం కలుగుతుంది. 

అక్కినేని నాగచైతన్య - సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం `లవ్ స్టోరి` . ఈనెల 24న విడుదలై మంచి కలెక్షన్స్ తో భాక్సాఫీస్ వద్ద రికార్డ్ లు బ్రద్దలు కొడుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లలోనూ `లవ్ స్టోరి` కొత్త అద్యాయం సృష్టిస్తుందని అంటున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాని చూసిన సినీ ప్రముఖుల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ ఈ మూవీని చూసి ప్రశంసల జల్లు కురిపించారు. నాగచైతన్య - కమ్ముల సహా సాయి పల్లవిని ప్రశంసల్లో ముంచెత్తారు. నిర్మాత నారంగ్ కి శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ కొన్ని వరుస ఎమోషనల్ ట్వీట్లు చేసారు.

“శేఖర్ కమ్ముల దర్శకత్వం బాగుంది. నాగ చైతన్యలోని నటుడిని బయటకు తీసుకొచ్చిన చిత్రం ‘లవ్ స్టోరీ’. ఆయనకు ఇది గేమ్ చేంజర్. మంచి పర్ఫార్మెన్స్… సంగీత దర్శకుడు పవన్ సిహెచ్ సెన్సషనల్ మ్యూజిక్ అందించారు. వాట్ ఏ మ్యూజిక్… ఏఆర్ రెహమాన్ గారు ఆయన మీ శిష్యుడని విన్నాను. మరు ఖచ్చితంగా ఆయన గురించి గర్వపడతారు. ఈ టెస్టింగ్ సమయంలో ‘లవ్ స్టోరీ’ నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరమైన బ్లాక్ బస్టర్ మూవీని ఇచ్చారు” అంటూ చిత్రబృందం ప్రతి ఒక్కరినీ మహేష్ పేరు పేరునా అభినందించారు.

ఇక సాయి పల్లవిని మాత్రం ఇంకా స్పెషల్ గా ప్రశంసించారు. “సాయి పల్లవి ఎప్పటిలాగే సెన్సేషనల్… ఈ అమ్మాయికి అసలు బోన్స్ ఉన్నాయా ?! ఇప్పటి వరకూ సిల్వర్ స్క్రీన్ పై ఎవరూ ఇలా డ్యాన్స్ చేయడం చూడలేదు. ఆమె కలలా కదులుతుంది” అంటూ సాయి పల్లవిని పొగడ్తలతో ముంచెత్తారు.

 

శేఖర్ కమ్ముల లవ్ స్టోరీని అద్భుతంగా తెరకెక్కించారు.  చైతూ నటుడిగా చాలా ఎదిగాడు. అతడికి  ఈ సినిమా గేమ్ ఛేంజర్ కానుంది. వ్వాటే పెర్ఫామెన్స్..! అంటూ ప్రశంసించారు. నిర్మాతలు నారాయణ్ దాస్ కె. నారంగ్- పుస్కర్ రామ్ మోహన్ రావు లకు అభినందనలు తెలియచేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవి, ఏఎన్నార్ భయపడేది ఆ హీరోయిన్ కి మాత్రమే.. ఎంత చనువుగా ఉన్నా వణికిపోవాల్సిందే
థాంక్యూ మై దోస్త్.. మహేష్ బాబు కు ప్రియాంక చోప్రా ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకో తెలుసా?