
సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి సినిమా కోసం మీసం, గడ్డం పెంచుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల మహేష్ లుక్ కు సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. ఎప్పుడూ క్లీన్ షేవ్ తో స్మార్ట్ గా కనిపించే మహేష్ గడ్డం పెంచడంతో ఆ ఫోటోలు కాస్త వైరల్ అయ్యాయి.
అయితే తాజాగా తెలుగు మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ కు సంబంధించిన ఓ వేడుకకు, అలానే సమ్మోహనం ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరైన మహేష్ తన సరికొత్త లుక్ తో అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. లుక్ పరంగా మహేష్ ప్రయోగాలు చేయడానికి ఇష్టపడరు. కానీ తన 25వ సినిమా కోసం డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నారు. ఈ లుక్ లో మహేష్ మరింత అందంగా కనిపిస్తుండడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి..