మహేష్ లుక్ రివీల్ చేసింది!

Published : May 31, 2018, 03:45 PM IST
మహేష్ లుక్ రివీల్ చేసింది!

సారాంశం

'భరత్ అనే నేను' సినిమాతో సక్సెస్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి

'భరత్ అనే నేను' సినిమాతో సక్సెస్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి టూర్ ఎంజాయ్ చేస్తున్నాడు. స్పెయిన్ లో మహేష్ తన భార్య బిడ్డలతో సమయం గడుపుతున్నారు. అలానే మరోపక్క తన తదుపరి సినిమా కోసం కొత్త లుక్ ను ట్రై చేస్తున్నాడు.

ఇప్పటివరకు మహేష్ తన సినిమాలలో కొత్త లుక్ జోలికి వెళ్లలేదు. గడ్డం, మీసాలతో కనిపించింది లేదు.. కానీ ఈసారి మాత్రం మహేష్ గడ్డం, మీసాలతో కనిపించబోతున్నాడంటూ వార్తలు వినిపించాయి. ఆ వార్తలకు బలం చేకూరుస్తూ నమ్రత ఓ ఫోటోను షేర్ చేసింది.

మహేష్ పూర్తి ఫేస్ ఈ ఫోటోలో కనిపించ నప్పటికీ సైడ్ నుండి గడ్డం ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇక హెయిర్ స్టైల్ కూడా కొత్తగా కనిపిస్తుంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై నుండి మొదలుకానుంది. 

PREV
click me!

Recommended Stories

Highest Remuneration: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్ల పారితోషికాలు.. అత్యధికంగా తీసుకునేది ఎవరంటే?
బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్