అన్నపూర్ణ స్టూడియోస్ లో వ్యక్తి మృతి.. గుట్టుచప్పుడు కాకుండా హాస్పిటల్ కు తరలింపు!

Published : May 31, 2018, 03:24 PM IST
అన్నపూర్ణ స్టూడియోస్ లో వ్యక్తి మృతి.. గుట్టుచప్పుడు కాకుండా హాస్పిటల్ కు తరలింపు!

సారాంశం

అక్కినేని నాగార్జునకు సంబంధించిన అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో

అక్కినేని నాగార్జునకు సంబంధించిన అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 52 ఏళ్ల వయసు గల నారాయణరెడ్డి చాలా కాలంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో పని చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో ఆయన మరణించారు. ఆయనను ఎవరో కావాలనే హత్య చేసి ఉంటారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

నారాయణరెడ్డి మరణించిన తరువాత తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చడీచప్పుడు లేకుండా ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారని, ఆయన శరీరంపై గాయాలు కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు. దీంతో ఈ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ కేసుపై విచారణ చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

సుజీత్ కి పవన్ కారు గిఫ్ట్ గా ఎందుకు ఇచ్చారో తెలుసా ? అంత పెద్ద త్యాగం చేశాడా, హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
The Raja Saab: ప్రభాస్ రాజాసాబ్ సాంగ్ పై విపరీతంగా ట్రోలింగ్.. వర్షం, డార్లింగ్ సినిమాలు వైరల్