కృష్ణ బర్త్ డే... భావోద్వేగానికి గురైన మహేష్, నమ్రత... ప్రేమపూర్వక శుభాకాంక్షలు! 

Published : May 31, 2022, 12:52 PM ISTUpdated : May 31, 2022, 12:53 PM IST
కృష్ణ బర్త్ డే... భావోద్వేగానికి గురైన మహేష్, నమ్రత... ప్రేమపూర్వక శుభాకాంక్షలు! 

సారాంశం

సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు నేపథ్యంలో అభిమానులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.అలాగే కృష్ణ తనయుడు మహేష్, కోడలు నమ్రత ఆయనకు బెస్ట్ విషెస్ తెలియజేశారు.   

టాలీవుడ్ లెజెండరీ నటుడు కృష్ణ 79వ జన్మదినం నేడు (Krishna Birthday). ప్రపంచవ్యాప్తంగా ఉన్న కృష్ణ అభిమానులు ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖులు కృష్ణగారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా కుమారుడు మహేష్ ప్రియమైన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ''హ్యాపీ బర్త్ డే నాన్న!  మీలా మరొకరు లేరు మీకు మీరే సాటి. రానున్న కాలమంతా ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవితం సాగాలని కోరుకున్నాను. ఆ దేవుని దయ ఎప్పుడూ మీకు ఉంటుంది. లవ్ యూ'' అంటూ ఎమోషనల్ అయ్యారు. 

అలాగే కోడలు నమ్రత సైతం ఒక ఎమోషనల్ విషెస్ నోట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. '' ప్రతి మధుర క్షణం లో మీరు ఉన్నారు. ప్రేమ, సంతోషం, దయ, నవ్వులు మీరు నా జీవితంలోకి తీసుకొచ్చారు. దానికి నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా భర్తకు మాత్రమే కాకుండా మా అందరికీ తండ్రి అయినందుకు కృతజ్ఞతలు. హ్యాపీ బర్త్ డే మామయ్య.. మేము మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం... అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. 

కృష్ణ అంటే మహేష్(Mahesh Babu), నమ్రతలకు ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో వారి వాడిన పదాల ద్వారా అర్థం అవుతుంది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ గా మారాయి. కృష్ణ బర్త్ డే నాడు మహేష్ అప్ కమింగ్ చిత్రాలపై అప్డేట్స్ ఉంటాయి. ఈసారి ఎటువంటి అప్డేట్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. కనీసం మహేష్-త్రివిక్రమ్ మూవీపై కూడా అప్డేట్ ఇవ్వలేదు. త్రివిక్రమ్ మూవీ జులైలో సెట్స్ పైకి వెళ్లనుంది. అనంతరం మహేష్ దర్శకుడు రాజమౌళి మూవీ చేయాల్సి ఉంది. ఈ భారీ ప్రాజెక్ట్ 2023లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు. 

PREV
click me!

Recommended Stories

Boyapati Sreenu: చిరంజీవితో బోయపాటి సినిమా ఎందుకు చేయలేదో తెలుసా ? బాలకృష్ణ అఖండ వల్ల అంత జరిగిందా..
నా కూతురు చిన్న పిల్ల... మీరు రాసే వార్తలు చదివితే తట్టుకోగలదా? స్టార్ హీరో ఎమోషనల్