'తను ఈ పాటను రిపీట్ మోడ్‌లో వింటూనే ఉంది. ఇదే తన కొత్త ఫేవరెట్ సాంగ్' అని కామెంట్ చేస్తూ ఈ వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు మహేష్. ప్రస్తుతం సితార బూం బూం సాంగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల మహేష్ నటిస్తున్న స్పైడర్ మూవీ సెట్‌లో సందడి చేసిన సితార గతంలోనూ తన డాన్స్‌తో ప్రిన్స్ ఫ్యాన్స్‌ని ఫిదా చేసేసింది. అంతే కాకుండా బ్రమ్మోత్సవం సినిమాలో సమంత చెప్పిన డైలాగ్‌ను సితార.. సమంత కంటే బాగా చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో తన చిట్టిపొట్టి మాటలు, పాటలతో అలరిస్తున్న మహేష్ ముద్దుల కూతురు సితార వెండి తెరపై అల్లరి చేసేది ఎప్పుడా అని మహేష్ ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
