హీరో విశాల్ కు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు

Published : Aug 07, 2017, 06:43 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
హీరో విశాల్ కు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు

సారాంశం

హీరో విశాల్ కు సినిమా చిత్రీకరణ సందర్భంగా తీవ్రగాయాలు తుప్పరివాలన్ సినిమా షూటింగ్ లో గాయపడ్డ విశాల్ డూప్ లేకుండా ఫైట్ సీన్ లో నటించడంతో విశాల్ కు గాయాలు

కోలీవుడ్ హీరో విశాల్ తెలుగు వాడైనా తమిళ ఇండస్ట్రీలో బాగా రాణించాడు. కోలీవుడ్ లో తన సత్తా చాటిన విశాల్ తెలుగు లో పందెం కోడి చిత్రంతో మంచి విజయం సాధించి తెలుగు ప్రేక్షకులకు కూడా అభిమాన హీరోగా మారాడు. తమిళంలో తీసిన చిత్రాలు చాలా వరకు తెలుగు లో డబ్ అయ్యాయి. ప్రస్తుతం తమిళ నిర్మాతల సంఘం (నడిగర్)కి అధ్యక్షుడు గా వ్యవహరిస్తున్నాడు విశాల్.

 

తాజాగా 'తుప్పరివాలన్' షూటింగ్ లో ఓ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా విశాల్ ఎడమ కాలికి గాయాలయ్యాయి.  కొన్ని ఫైట్ సీన్లు విశాల్ ఎలాంటి డూప్ లేకుండా చేస్తుంటారని వినికిడి.  ఈ సందర్భంగా ఓ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో అనుకోకుండా విశాల్ కిందపడిపోవడంతో ఎడమ కాలికి తీవ్రంగా గాయమైందట.

 

గాయమైన వెంటనే ప్రథమ చికిత్స చేసి అతన్ని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా విశాల్ ను చూసేందుకు భారీ ఎత్తున ఆయన అభిమానులు ఆసుపత్రి వద్దకు తరలివచ్చారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

100 సినిమాల్లో 44 ప్లాప్ లు, 30 మూవీస్ రిలీజ్ అవ్వలేదు, అయినా సరే ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?