
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మాచర్ల నియోజకవర్గం'. ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న చిత్రం ఇది. నితిన్ ఈ మూవీపై చాలానే హోప్స్ పెట్టుకుని ఉన్నాడు. నితిన్ చివరగా నటించిన చిత్రాలు ఆశించిన సక్సెస్ అందించలేకపోయాయి.
మాచర్ల నియోజకవర్గంపై నితిన్ బోలెడు ఆశలే పెట్టుకుని ఉన్నాడు. ఆగష్టు 12న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండడంతో నెమ్మదిగా ప్రచార కార్యక్రమాలు జోరందుకుంటున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ అంజలి ఐటెం సాంగ్ లో పెర్ఫామ్ చేసిన సంగతి తెలిసిందే. 'రారా రెడ్డి' అంటూ సాగే ఐటెం సాంగ్ ని ఇటీవల విడుదల చేశారు. ఈ సాంగ్ లో నితిన్, అంజలి ఇద్దరూ ఊరమాస్ స్టెప్పులతో అదరగొడుతున్నారు.
ఈ సాంగ్ చివర్లో నితిన్ 'జయం' చిత్రంలోని ఫేమస్ సాంగ్ రాను రానంటూనే చిన్నదో అనే లిరిక్స్ వినిపిస్తాయి. ఈ ఐటెం సాంగ్ లో ఆ లిరిక్స్ ని రీమిక్స్ చేశారు. ఈ సాంగ్ తో నెటిజన్లు ప్రయోగాలు చేస్తున్నారు. ఈ సాంగ్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది ? ఈ ప్రశ్న విచిత్రంగా ఉంది కదూ.. కానీ నెటిజన్లు దీనిని నిజం చేసి చూపించారు.
సర్కారు వారి పాట చిత్రంలోని మ మ మహేషా సాంగ్ లో మహేష్ బాబు డ్యాన్స్ కి నితిన్ సాంగ్ ని పర్ఫెక్ట్ గా సింక్ చేశారు. నెటిజన్లు క్రియేట్ చేసిన ఈ వీడియో చూస్తుంటే నిజంగా మహేష్ బాబు 'రాను రాను అంటూనే చిన్నదో' సాంగ్ కి డ్యాన్స్ చేస్తున్నట్లే ఉంది. నితిన్ కూడా ఈ వీడియోకి ఫిదా అయ్యాడు. అదిరిపోయింది.. పర్ఫెక్ట్ సింక్ అంటూ ట్విట్టర్ లో కామెంట్స్ చేశాడు.