#TheWarriorr: అడ్వాన్స్ బుక్కింగ్స్ దారుణం? ఎక్కడుంది లోపం

Published : Jul 13, 2022, 03:58 PM IST
#TheWarriorr: అడ్వాన్స్ బుక్కింగ్స్ దారుణం? ఎక్కడుంది లోపం

సారాంశం

భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఈ సినిమాకు ముందు నుంచి కూడా మంచి ప్రచారం జరగడంతో అటు ఇండస్ట్రీ వర్గాల్లో, డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థలో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి.

ఈ మధ్య కాలంలో మాస్ యాక్షన్ సినిమాల చేయాలని ఫిక్సైపోయిన   రామ్, తన తాజా చిత్రంగా 'ది వారియర్' చేశాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకి లింగుసామి దర్శకత్వం వహించాడు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను ఈ నెల 14వ తేదీన విడుదల చేస్తున్నారు.  సెన్సార్ వద్ద U/A సర్టిఫికెట్ తెచ్చుకున్న ఈ సినిమా, ఇక థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. రామ్ ఫస్టు టైమ్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన సినిమా ఇది. ఇక రేడియో జాకీగా కృతి శెట్టి కనిపించనుంది. ఈ చిత్రం హైదరాబాద్  బుక్కింగ్స్ అంత ప్రోత్సాహకరంగా కనపడటం లేదు. 

ఇండస్ట్రీ దృష్టి మొత్తం ఈ సినిమా ఓపినింగ్స్ పై ఉన్నాయి. ఓ యాక్షన్ సినిమా కు, అదీ ఓ స్టార్ హీరో సినిమా కి తగినట్లుగా అడ్వాన్స్ బుక్కింగ్స్ జరగటం లేదు. బిలో యావరేజ్ స్దాయిలో బుక్కింగ్స్ ఉండటం అభిమానులను నిరాశ పరుస్తోంది.  మరి కొద్ది గంటల్లో సినిమా షో స్టార్ట్ అవుతుంది కానీ ఆ స్పీడు కనబడటం లేదు. నైజాంలో 12 నుంచి 13 కోట్ల మధ్యలో రైట్స్ అమ్ముడయ్యాయి. రామ్ కెరీర్ లో బెస్ట్ బిజినెస్ జరిగిన చిత్రంగా చెప్తున్నారు కానీ థియోటర్స్ దగ్గర స్పీడు కనపడకపోవటంతో ట్రేడ్ లో కంగారు మొదలైంది.

 ఈ సినిమా కు సరైన ఓపినింగ్స్ లేకపోతే భాక్సాఫీస్ దగ్గర సినిమాల పరిస్దితి అగమ్య గోచరమే అవుతుంది. ఇన్నాళ్లు చిన్న సినిమాలు కాబట్టి జనం పట్టించుకోవటం లేదు అంటున్నారు. అలాంటిది రామ్ సినిమాకు సేమ్ సీన్ రిపీట్ అయితే చాలా కష్టం. ఓ ప్రక్కన భారీ టిక్కెట్ రేట్లు, మరో ప్రక్క వరస పెట్టి వర్షాలు ఈ సినిమా ఓపినింగ్స్ పై బాగా ఇంపాక్ట్ చూపిస్తున్నాయంటున్నారు. చూడాలి మరి రేపటికి ఏమన్నా పికప్ అవుతాయేమో. 
 
దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి వదిలిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలు మాస్ ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయ్యాయి. చాలా కథల తరువాత ఈ కథకి  ఓకే చెప్పడం జరిగిందని రామ్ చెబుతున్నాడు. అంత ప్రత్యేకత ఈ కథలో ఏముందనేది ఆసక్తికరంగా మారింది. 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..