కళావతి పాటకు 150 మిలియన్ వ్యూస్, దూసుకెళ్తున్న సర్కారువారి పాట

Published : Apr 26, 2022, 08:02 PM IST
కళావతి పాటకు 150 మిలియన్ వ్యూస్, దూసుకెళ్తున్న సర్కారువారి పాట

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారువారి పాట మూవీ రిలీజ్ అవ్వకముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈమూవీ నుంచి వచ్చిన పాటలకు మిలియన్స్ లొ వ్యూస్ వస్తున్నాయి. రీసెంట్ గా కళావతి సాంగ్.. సరికొత్త రికార్డ్స్ క్రయేట్ చేస్తోంది.   

మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో  తెరకెక్కుతోన్న సినిమా సర్కారు వారి పాట. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ తో పాటు 14 రీల్స్  సంస్థ  నిర్మించిన ఈ సినిమాకి మహేశ్ బాబు కూడా ఒక నిర్మాతగా ఉన్నాడు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ గా వచ్చిన కళావతి పాట కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతోంది. 

అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను, సిద్ శ్రీరామ్ పాడారు. ఈపాటకు అద్బతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇర తాజాగా ఆ పాట 150 మిలియన్ ప్లస్ వ్యూస్ ను సాధించి  అరుదైన రికార్డును నమోదు చేసింది.ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించిన ఈ పాట ఇంకా అదే స్పీడ్ తో దూసుకునిపోతోంది. 

సర్కారువారి పాట సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. బ్యాంకు స్కామ్ చుట్టూ తిరిగే ఈ సినిమాకి భారీ యాక్షన్ తో పాటు కామెడీ కథతో ఈసినిమా తెరకెక్కుతోంది. సముద్రఖని, వెన్నెల కిశోర్ లాంటి సీనియర్స్ లీడ్ రోల్స్ పోషించిన ఈ సినిమాను మే 12న రిలీజ్ కాబోతోంది.  

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్
Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?