కానిస్టేబుల్‌ జాబ్‌ వదిలేసి సీరియల్‌ కిల్లర్‌గా మారిన కీర్తిసురేష్‌.. ఏకంగా 24 హత్యలు..

Published : Apr 26, 2022, 07:22 PM IST
కానిస్టేబుల్‌ జాబ్‌ వదిలేసి సీరియల్‌ కిల్లర్‌గా మారిన కీర్తిసురేష్‌.. ఏకంగా 24 హత్యలు..

సారాంశం

 ఎంతో సున్నితంగా ఉండే కీర్తిసురేష్‌ ఒక్కసారిగా హంతకురాలిగా మారిపోయింది.  లేడీ కానిస్టేబుల్‌ జాబ్‌ చేసే ఆమె  సీరియల్‌ కిల్లర్‌గా మారి ఏకంగా 24 హత్యలు చేయడం షాకిస్తుంది.

`మహానటి`తో సావిత్రి జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపించింది కీర్తిసురేష్‌. ఆ తర్వాత `పెంగ్విన్‌` వంటి థ్రిల్లర్‌ చిత్రాల్లో మెరిసింది. కమర్షియల్‌ చిత్రాలతోనూ ఆకట్టుకుంటుంది. ఇప్పుడు మహేష్‌తో `సర్కారు వారి పాట`లో అందంగా డ్యూయెట్లు పాడుకుంటోంది. అలాంటి ఎంతో సున్నితమైన కీర్తిసురేష్‌ ఒక్కసారిగా హంతకురాలిగా మారిపోయింది.  లేడీ కానిస్టేబుల్‌ జాబ్‌ చేసే ఆమె ఏకంగా సీరియల్‌ కిల్లర్‌గా మారి 24 హత్యలు చేసింది. మొత్తానికి దొరికిపోయి పోలీసులు విచారిస్తుండగా, ఆ పోలీస్‌ని కూడా చంపేస్తానంటూ బెదిరిస్తుంది. వరుసగా హత్యలు చేస్తూ వెన్నులో వణుకుపుట్టిస్తుంది. 

కీర్తిసురేష్‌ని ఇలా చూసి ఆమె అభిమానులు కూడా షాక్‌ అవుతున్నారు. అయితే ఇదంతా `చిన్ని` అనే చిత్రంలోని స్టోరీ కావడం విశేషం. కీర్తిసురేష్‌, సెల్వరాఘవన్‌ కలిసి నటించిన తమిళ చిత్రం `సాని కాయిదమ్‌`. తమిళంలో రూపొందిన ఈ సినిమాని తెలుగులో `చిన్ని`గా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో ఓటీటీ చిత్రంగా విడుదల కాబోతుంది. మే 6న రిలీజ్‌ చేయబోతున్నారు. తాజాగా `చిన్ని` చిత్ర తెలుగు, తమిళ ట్రైలర్లు విడుదల చేశారు. ఇందులో కీర్తిసురేష్‌ సీరియల్‌ కిల్లర్‌గా కనిపించబోతుండటం విశేషం. కిల్లర్‌గా విశ్వరూపం చూపించింది.

`చిన్ని` ట్రైలర్‌లో కీర్తిసురేష్‌ సఖినేటిపల్లి గ్రామానికి చెందిన `చిన్ని`గా, సెల్వరాఘవన్‌ రంగయ్యగా నటిస్తున్నారు.  కానిస్టేబుల్‌గా పనిచేస్తే చిన్ని రంగయ్యతో కలిసి 24 హత్యలు చేసింది. తనని విసిగిస్తున్న పోలీస్‌ని కూడా చంపేస్తానని, దీంతో 25 హత్యలవుతాయని బెదిరించడం, ఆ తర్వాత వరుసగా హ్యతలు చేస్తున్నట్టుగా సాగే ఈ `చిన్ని` ట్రైలర్ ఆకట్టుకోవడంతోపాటు గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. మరి కానిస్టేబుల్‌గా పనిచేసే చిన్ని ఎందుకు సీరియల్‌ కిల్లర్‌గా మారిందనేది సస్పెన్స్ గా మారింది. సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఇప్పటి వరకు సాఫ్ట్ రోల్స్ చేసిన కీర్తిసురేష్‌ ఇలాంటి కిల్లర్‌ రోల్స్ చేయడం షాకిస్తుంది. ఈ చిత్రానికి అరుణ్‌ మథేశ్వరన్‌ దర్శకత్వం వహించారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు