#Gunturkaaramott 'గుంటూరు కారం' OTT రిలీజ్ ట్విస్ట్, షాక్ లో ఫ్యాన్స్

By Surya Prakash  |  First Published Jan 21, 2024, 6:42 AM IST

మహేశ్ మాస్ యాక్షన్, డ్యాన్స్‌ ఈ చిత్రానికి హైలైట్‍గా ఉన్నాయి. అలాగే గుంటూరు కారం సినిమా ఓటీటీలోకి ఎప్పుడు రానుందో సమాచారం వెల్లడైంది.



సంక్రాంతి కానుకగా విడుదలైన  గుంటూరు కారం ఓటిటి రిలీజ్ కు రంగం సిద్దమైందని  సమాచారం. అయితే అతి తక్కువ టైమ్ లో ఓటిటిలో వచ్చేయటం ఫ్యాన్స్ కు బాధ కలిగిస్తోంది.  వాస్తవానికి గుంటూరు కారం తొలి ఆట నుంచే డివైడ్  టాక్  తెచ్చుకుంది. అయినా  మహేష్ మేనియాతో వ‌సూళ్ల‌లో మాత్రం ఓ రేంజిలో  దూసుకుపోయింది. దానికి తోడు  హ‌నుమాన్ మిన‌హా మిగిలిన సంక్రాంతి సినిమాల‌ు ఏవీ పోటి ఇవ్వకపోవటం గుంటూరు కారంకు  క‌లిసివ‌స్తోంది. మహేష్ బాబు ఛార్మ్,ఫ్యామిలీలలో ఆయనకు ఉన్న  ఫాలోయింగ్ బాగా వర్కవుట్ అవుతోంది. దానికి తోడు త్రివిక్రమ్ మార్క్ సెంటిమెంట్ ఫ్యామిలీలకు నచ్చుతోంది.  ఈ నేపధ్యంలో టిక్కెట్ రేట్లు కాస్త తగ్గి ఫ్యామిలీలు మరింత గా థియేటర్ కు వెళ్తారు అనుకున్న టైమ్ లో ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతోందనే వార్త వచ్చింది. 

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్.. చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మహేశ్ కొత్త సినిమాని 28 రోజుల్లోపే ఓటీటీలోకి తీసుకురానుందని సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే ఫిబ్రవరి రెండో వారంలో అంటే 9 లేదా 10వ తేదీన 'గుంటూరు కారం' ఓటీటీలో వచ్చేయొచ్చు.   'సలార్' ఓటీటీ విడుదలనే దీనికి ఉదాహరణగా ఎదురుగా కనిపిస్తోంది. అయితే అఫీషియల్ ఎనౌన్సమెంట్ అయితే ఇప్పటిదాకా లేదు. 

Latest Videos

ఇదిలా ఉంటే ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) కలెక్షన్స్‌ విషయంలో ఆనందం వ్యక్తం చేశారు చిత్ర నిర్మాత నాగవంశీ (Naga Vamsi). తమ చిత్రాన్ని ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. ‘‘మా సినిమా విడుదలై వారం రోజులైంది. ఫస్ట్‌ వీక్‌ కలెక్షన్స్‌ బాగా వచ్చాయి. బయ్యర్స్ బ్రేక్‌ ఈవెన్‌ దగ్గర్లోకి వచ్చేశారు. నాకు తెలిసినంత వరకూ రివ్యూలు మా సినిమాపై ప్రభావం చూపించలేదు. ప్రీమియర్‌ షోస్‌ అనంతరం ఆన్‌లైన్‌లో జరిగిన హంగామా వల్ల ప్రేక్షకులు కాస్త గందరగోళానికి గురయ్యారు. ఫస్ట్‌ షో తర్వాత పాజిటివ్‌ రివ్యూలు వచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌ మా చిత్రాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. తల్లీ-కొడుకుల సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యింది. అందుకే మంచి రెవెన్యూ వచ్చింది’’

ఈ సినిమా లో కథ ఎలా ఉన్నా...‘అన్నం వ‌ద్ద‌నుకున్న‌వాడు  రోజంతా ప‌స్తులుంటాడు, అమ్మ‌ని వ‌ద్ద‌నుకున్న‌వాడు జీవితాంతం ఏడుస్తాడు’. ‘అమ్మ త‌న బిడ్డ‌ల‌కి ఏం చేసింద‌ని అడ‌గ‌కూడ‌దు’, ‘త‌ద్దినం జ‌న్మ‌దినం రెండూ దినాలే’ త‌ర‌హా సంభాష‌ణ‌లు ఆకట్టుకున్నాయి. అలాగే  మాస్  పాత్ర‌లో మ‌హేశ్‌బాబు చేసే హంగామా, ఆయ‌న ఎన‌ర్జీ,  మాస్ పాట‌లు,  ఇంట్రవెల్ సీన్స్ , క్లైమాక్స్ సీన్స్ లో ఎమోషన్స్  ఇవే ఈ సినిమాకు బలం.
 
  గుంటూరు కారం చిత్రంలో శ్రీలలో పాటు  హీరోయిన్ మీనాక్షీ చౌదరి, ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు.   హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అయ్యింది..  అతడు, ఖలేజా  చిత్రాల తర్వాత మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందిన  ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.  మహేశ్‌ - త్రివిక్రమ్‌ స్టైల్ మాస్‌ అంశాలతో ఈ చిత్రం రూపొందింది.
 

click me!