ప్రభాస్‌, విజయ్‌ దేవరకొండ కలిస్తే రచ్చే.. నాగ్‌ అశ్విన్‌ కి ఆ ఛాన్స్ ఇప్పుడు వచ్చిందట?

Published : Jan 20, 2024, 09:08 PM IST
ప్రభాస్‌, విజయ్‌ దేవరకొండ కలిస్తే రచ్చే.. నాగ్‌ అశ్విన్‌ కి ఆ ఛాన్స్ ఇప్పుడు వచ్చిందట?

సారాంశం

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ.. భారీ మూవీలో భాగమవుతున్నారు. ప్రభాస్‌ మూవీలో ఆయన నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

విజయ్‌ దేవరకొండ హీరోగా బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ఇప్పుడు రెండు సినిమాలున్నాయి. ప్రస్తుతం `ఫ్యామిలీ స్టార్‌` మూవీలో నటిస్తున్నారు. మరో సినిమా ఈ మార్చిలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో విజయ్‌ దేవరకొండ ఇప్పుడు పలు రకాల అంశాల్లో వార్తల్లో నిలుస్తున్నారు. అందులో ఒకటి ప్రభాస్‌ సినిమాలో ఆయన నటిస్తున్నారట. 

ప్రభాస్‌ ప్రస్తుతం `కల్కి 2898ఏడీ`లో నటిస్తున్నారు. భవిష్యత్‌లో జరిగే కథ ఇది. సైన్స్ ఫిక్షన్‌గా, హాలీవుడ్‌ మూవీ తరహాలో రూపొందుతుంది. ఇందులో కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ నటిస్తుంది. ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. మేలో మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఇందులో మరో స్టార్‌ కనిపిస్తారని, అది విజయ్‌ దేవరకొండ అంటున్నారు.

`కల్కి`లో విజయ్‌ దేవరకొండ గెస్ట్ రోల్‌ చేస్తున్నారని, చిన్న కొమియోలో కనిపిస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం విజయ్‌ ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడని సమాచారం. ఆయన పాత్ర చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్తలు చాలా గట్టిగానే వినిపిస్తుండటం విశేషం. అటు ప్రభాస్‌ ఫ్యాన్స్ ని, ఇటు విజయ్‌ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాయి. ప్రభాస్‌ మూవీలో విజయ్‌ కనిపిస్తారంటే ఆ రచ్చ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. ఇది సినిమా స్థాయిని మరింతగా పెంచుతుంది. 

ఇదిలా ఉంటే `కల్కి` దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, విజయ్‌ దేవరకొండ మంచి స్నేహితులు. `ఎవడే సుబ్రమణ్యం` నుంచి ట్రావెల్‌ అవుతున్నారు. విజయ్‌ ని తన సినిమాల్లో తీసుకోవాలనేది నాగ్‌ అశ్విన్‌ కోరిక. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆయన్ని తన సినిమాల్లో భాగం చేయాలని ఆయన భావిస్తున్నట్టు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాకపోతే ప్రయారిటీ లేని పాత్రలో తీసుకోవడం ఆయనకు ఇష్టం లేదని, విజయ్‌ మాత్రమే కావాలనిపించే సినిమాల్లో తీసుకుంటా అని చెప్పారు. ఆ అవకాశం ఇప్పుడు వచ్చిందట. `కల్కి`తో ఆ కోరిక తీర్చుకోబోతున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. 

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వంలో `ఫ్యామిలీ స్టార్‌` మూవీ చేస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో రష్మిక మందన్నా ఓ పాటలో మెరుస్తుందని సమాచారం. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది. మరోవైపు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు విజయ్‌. ఇది మార్చిలో ప్రారంభం అవుతుందట. గ్యాంగ్‌ స్టర్‌ ప్రధానంగా ఈ మూవీ సాగుతుందని తెలుస్తుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌