#Gunturkaaram మిడ్ నైట్ 1 AM షోలు తెలంగాణా థియేటర్స్ లిస్ట్

Published : Jan 10, 2024, 01:41 PM IST
#Gunturkaaram మిడ్ నైట్ 1 AM షోలు తెలంగాణా థియేటర్స్ లిస్ట్

సారాంశం

జనవరి 12 అర్థరాత్రి ఒంటిగంట నుంచి తెలంగాణలోని 23 ఏరియాల్లో బెనిఫిట్‌ షోల ప్రదర్శనకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల12 నుంచి 18 వరకు ఉదయం నాలుగు గంటల షోకు కూడా తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్‌ ఇచ్చింది. 


  సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో  ‘గుంటూరు కారం’చిత్రం రెండు రోజుల్లో రిలీజ్ అవుతోంది. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రం  ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది.   మహేష్ కు జోడీగా శ్రీలీలా నటిస్తున్న ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.  ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని సినిమా పై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజిలో జరిగినట్లు సమాచారం. దాదాపు వందకోట్లు దాకా బిజినెస్ జరిగినట్లు చెప్తున్నారు. అలాగే సినిమా మహేష్ పేరు కూడా బయిటకు వచ్చింది. ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో మహేష్ బాబు పేరు వెంకట రమణారెడ్డి అలియాస్ రవణ. గుంటూరులో మిర్చి వ్యాపారం చేస్తుంటాడు.

ఈ  సినిమా టికెట్‌ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఫర్మిషన్స్ ఇచ్చింది.  సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ. 65, మల్లీఫ్లెక్స్‌లలో రూ. 100 పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. జనవరి 12 అర్థరాత్రి ఒంటిగంట నుంచి తెలంగాణలోని 23 ఏరియాల్లో బెనిఫిట్‌ షోల ప్రదర్శనకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల12 నుంచి 18 వరకు ఉదయం నాలుగు గంటల షోకు కూడా తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్‌ ఇచ్చింది. తెలంగాణాలో ఎక్కడెక్కడ గుంటూరు కారం సినిమా బెనిఫిట్ షోలు పడనున్నాయో లిస్ట్...

ఏఎంబీ సినిమాస్ (గచ్చిబౌలి)
నెక్సస్ మాల్ (కూకట్‌పల్లి)
భ్రమరాంబ థియేటర్ (కూకట్‌పల్లి)
మల్లికార్జున థియేటర్ (కూకట్‌పల్లి)
అర్జున్ థియేటర్ (కూకట్‌పల్లి)
విశ్వనాథ్ థియేటర్ (కూకట్‌పల్లి)
శ్రీరాములు థియేటర్ (మూసాపేట)
గోకుల్ థియేటర్ (ఎర్రగడ్డ),
సుదర్శన్ 35MM (RTC X రోడ్స్)
ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ( నెక్లెస్ రోడ్)
రాజధాని డీలక్స్ (దిల్‌సుక్ నగర్),
శ్రీ సాయి రామ్ థియేటర్ (మల్కాజిగిరి)
శ్రీప్రేమ థియేటర్ (తుక్కుగూడ)
SVC మల్టీప్లెక్స్ (గజ్వేల్)
మమతా థియేటర్ (కరీంనగర్)
రాధిక థియేటర్ (వరంగల్)
అమృత థియేటర్ (హనుమకొండ)
SVC తిరుమల థియేటర్ (ఖమ్మం)
వినోద థియేటర్ (ఖమ్మం)
నటరాజ్ థియేటర్ (నల్గొండ)
SVC విజయ థియేటర్ (నిజామాబాద్)
వెంకటేశ్వర థియేటర్ (మహబూబ్‌నగర్)
శ్రీనివాస థియేటర్ (మహబూబ్ నగర్)
  

అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. యాక్షన్‌ డ్రామాగా ఇది సిద్ధమవుతోంది. గుంటూరు కారం చిత్రంలో శ్రీలలో పాటు  హీరోయిన్ మీనాక్షీ చౌదరి, ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.   హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది..  అతడు, ఖలేజా  చిత్రాల తర్వాత మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.  మహేశ్‌ - త్రివిక్రమ్‌ స్టైల్ మాస్‌ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది.
 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?