Guntur Kaaram : గుంటూరు కారం నుంచి క్రేజీ అప్డేట్.. సెకండ్ సింగిల్ రెడీ.. ఎప్పుడంటే?

Published : Nov 21, 2023, 04:49 PM IST
Guntur Kaaram :  గుంటూరు కారం నుంచి క్రేజీ అప్డేట్.. సెకండ్ సింగిల్ రెడీ.. ఎప్పుడంటే?

సారాంశం

‘గుంటూరు కారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘దమ్ మసాలా’ దుమ్ములేపిన విషయం తెలిసిందే. తాజాగా నిర్మాత నాగవంశీ రెండో పాటపై అప్డేట్ ఇచ్చారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందించారు. 

స్టార్ హీరో, సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) - త్రివిక్రమ్ కాంబోలో ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. కాస్తాఆలస్యం అయినా మూవీ నుంచి సాలిడ్ అప్డేట్స్ ను వదులుతున్నారు. ప్రతి స్పెషల్ డేన ఓ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అభిమానుల ఒత్తిడితోపాటు సినిమాపై అంచనాలను పెంచేందుకు ఫస్ట్ సింగిల్ ను కూడా రిలీజ్ చేశారు యూనిట్. 

Dum Masala అంటూ వచ్చిన మొదటి పాటు సోషల్ మీడియాను షేక్ చేసింది. మహేశ్ బాబు పాత్రను ఎలివేట్ చేసేలా ఫస్ట్ సింగిల్ లిరిక్స్ సాగడం, మాస్ బీట్ కు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ క్రమలో ‘గుంటూరు కారం’పై నిర్మాత నాగవంశీ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందించారు. ‘ఆదికేశవ’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో అదిరిపోయే న్యూస్ చెప్పారు. గుంటూరు కారం ఏదశలో ఉందో చెప్పుకొచ్చారు. 

సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తైనట్టు తెలుస్తోంది. ఇంకా మూడు సాంగ్స్ మాత్రమే షూట్ చేయాల్సి ఉందని తెలిపారు. ఇక త్వరలోనే సెకండ్ సింగిల్ కూడా రాబోతుందని చెప్పుకొచ్చారు. వచ్చే వారంలోనే రెండో పాటను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని చెప్పుకొచ్చారు. సాంగ్స్ మాత్రం సూపర్ గా వచ్చాయని హైప్ పెంచారు. రిలీజ్ వరకు మొత్తం నాలుగు సాంగ్స్ ను విడుదల చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక సాంగ్ వచ్చింది. రెండో పాట రెడీ అవుతోంది. 

ఈ సినిమాలో మహేశ్ బాబు మాస్ లుక్ తో అలరించబోతున్నారు. చుట్టబీడి, బియర్డ్ తో రగ్డ్ అవతార్ లో థియేటర్లలో రచ్చ చేయబోతున్నారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మూడోసారి మహేశ్ - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో అన్నీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మార్కెట్ లోనూ డిమాండ్ ఉంది. 

మహేశ్ బాబు సరసన టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా (Sreeleela), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)  హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, జయరామ్, రమ్యకృష్ణ, సునీల్, బ్రహ్మనందం ముఖ్యమైన పాత్రలు పోషిస్తుండటం విశేసం. హారికా అండ్ హాసిని బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం 2024 జనవరి 12న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. 

PREV
click me!

Recommended Stories

Rajinikanth Biopic: వెండితెరపైకి తలైవా జీవితం.. రజనీకాంత్‌గా కనిపించేది ఎవరు? షాకింగ్‌ ట్విస్ట్
Jana Nayagan 4 Days Collections: ఆదివారం తన రేంజ్‌ చూపించిన విజయ్‌.. జన నాయకుడుకి అదిరిపోయే వసూళ్లు