Brahmanandam: ఆత్మకథ పూర్తి చేసిన బ్రహ్మానందం, ఆవిష్కరణకు అంతా సిద్దం, పుస్తకం టైటిల్ ఇదే..?

By Mahesh Jujjuri  |  First Published Nov 21, 2023, 3:23 PM IST

టాలీవుడ్ లో హాస్యనడిగా బ్రహ్మానందానికి ఒక చరిత్ర. ఆయన మూవీ కెరీర్ ఎందరో హాస్యనటులకు ఆదర్శం. అటువంటి  స్టార్ కమెడియన్ జీవితం ఆత్మకథగా ఆవిష్కరింపబడటానికి రెడీగా ఉంది. 


బ్రహ్మనందం.. ఆయన పేరులోనే ఆనందం ఉంది. ఆయన ఆడియన్స్ కు పంచింది కూడా ఆ ఆనందమే. ఎంతో మంది బాధల్లో ఉన్నవారికి సంతోషాన్ని నింపారు బ్రహ్మీ.  టెన్షన్స్ తో.. ఒత్తిడితో కొట్టుమిట్టాడుతున్న జనాలకు నవ్వుల వర్షం కురిపించిన హాస్య రారాజు బ్రహ్మానందం. 15 వందలకు పైగా సినిమాలు చేసి.. ఏకమెడియన్ కూడా సాధించలేని రికార్డ్ ను సాధించి గిన్నిస్ బుక్కుకెక్కాడు బ్రహ్మీ. ఇక ఆయనకు  తెలుగు భాషపై .. తెలుగు సాహిత్యంపై మంచి పట్టుంది. తెలుగు మాస్టారుగా పనిచేసిన ఆయన, ఆ తరువాతనే నటన దిశగా వచ్చి, హాస్య నటుడిగా ఒక వెలుగు వెలిగారు. కొన్నేళ్ల పాటు బ్రహ్మానందం లేని సినిమా అంటూ ఉండేది కాదు. 

హాస్య నటులలో ఆయన పోషించినన్ని పాత్రలను మరొకరు పోషించలేదనే చెప్పాలి. రెండు తరాల హీరోలతో కలిసి నటించిన ఘనత బ్రహ్మానందం సొంతం. ఆయనతో కలిసి నటించి స్టార్ హీరోలుగా ఎదిగిన వారు ఎందరో. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి తారల కెరీర్ బిగినింగ్ లో వారితో కలిసి నటించి సినిమాల సక్సెస్ కు కారణంగా నిలిచారు బ్రహ్మానందం. 

Tap to resize

Latest Videos

ఇక ఆయన హీరోగా,  ప్రధానమైన పాత్రధారిగా నటించిన మెప్పించిన సినిమాలు కూడా లేకపోలేదు. అలాంటి బ్రహ్మానందం ఈ మధ్య కాలంలో సినిమాల సంఖ్యను తగ్గించుకున్నారు. తనకి ఇష్టమైన పెయింటింగ్స్ ను వేస్తూనే గడిపేస్తున్నారు. అడపా దడపా సినిమాలు చేస్తూ.. రెస్ట్ తీసుకుంటున్నారు. ఎజ్ మీద పడటం, హార్ట్ ఆపరేషన్ తరువాత బ్రహ్మీ సినిమాలు చేయడం తగ్గించారు. ఒక రకంగా మానేశారని చెప్పోచ్చు. ఇక ప్రస్తుతం పెయింటింగ్స్ తోపాటు, తన ఆత్మకథను పూర్తిచేశారు. 
బ్రహ్మానందం. 

తన ఆత్మకథకు ఆయన 'నేను .. మీ బ్రహ్మానందం' అనే టైటిల్ పెట్టారు. తన జీవితం ... అనుభవాలు .. అనుభూతులు .. జ్ఞాపకాలను ఆయన ఈ పుస్తకంలో రాసుకొచ్చారట. ఇక ఈ పుస్తకాన్ని  వచ్చేనెలలో ఆవిష్కరించనున్నట్టు తెలుస్తోంది. ఆయన కొనసాగించిన జర్నీ ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి అలాంటి తన ఆత్మకథ ఎలా ఉంటుంది. ఎవరికి తెలియని విషయాలు అందులో ఎన్ని ఉంటాయి  అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు పుస్తక ప్రియులు. ఇక బ్రహ్మీ ప్యాన్స్ అయితే బుక్ కోసం ఎంతగానో ఎదరు చూస్తున్నారు. 
 

click me!