ఈమధ్య ఎవరూ ఊహించని కాంబినేషన్లపై సోషల్ మీడియా కోడై కూస్తోంది. చెప్పుకోడానికి చాలా మంది ఉన్నారు కాని. తాజగా వినిపిస్తున్న పేర్లు మాత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరన్ - సచిన్ కూతురు సారా టెండూల్కర్. ఇంతకీ ఇది నిజమేనా.
టాలీవుడ్ అనే కాదు.. ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఆడియన్స్ కు కాంబినేషన్ షాక్ లు ఇస్తుంది. ఇప్పటికే బాలయ్య , దుల్కర్ మల్టీ స్టారర్ అని, రామ్ చరణ్ , అల్లు అర్జున్ సరసన జాన్వీ నటించబోతుందని.. ఇలా రకరకాల రూమర్లు తెగ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో మరో కాంబోపై తాజాగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకు ముందు కాంబోలైనా... అప్పుడపుపుడు ఊహించి ఉంటామ్. కాని రామ్ చరణ్ హీరోగా.. సచిన్ కూతురు హీరోయిన్గా సినిమా అని ఎప్పుడైనా ఊహించారా..?
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముద్దుల కూతురు సారా టెండూల్కర్ ఈమధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. మరీ ముఖ్యంగా యంగ్ స్టార్ క్రికెటర్ శుభ్ మన్ గిల్ తో లవ్ ఎఫైర్ అంటూ దేశ మంతా పెద్ద చర్చ నడుస్తుండగా.. ఆమె మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా.. శుభమ్ తో చక్కర్లు కొడుతూ..షికార్లు చేస్తోంది. అంతే కాదు . త్వరలోనే వీరు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
undefined
ఇక ఇప్పుడు సారాకు చెందిన ఈ వార్త తెగులు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్ లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ సరసన సారా నటించబోతోందనేదే న్యూస్ వైరల్ అవుతోంది. ఇక అసలు వివరాల్లోకి వెళ్తే, రామ్ చరణ్ తో యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సినిమాను తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు, ఈ సినిమాలో క్రేజీ కాంబినేషన్ ను సెట్ చేయాలని బుచ్చిబాబు భావిస్తున్నారట. చెర్రీ సరసన సారా టెండూల్కర్ ను నటింపజేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారట.
అంతే కాదు మొన్నటి వరకూ.. ఈసినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతోంది అని టాక్ గట్టిగా నడిచింది. దాదాపు సాయి పల్లవి ఫిక్స్ అయ్యింది అన్నారు. కాని ఇంతలోనే సారా టెండూల్కర్ పేరు తెరపైకి వచ్చింది. మరిఇందులో నిజం ఎంత..? అసలు చరణ్ జోడీగా ఎవరు నటించబోతున్నారు అనేది ఆసక్తి కరంగా మారింది. మరి బుచ్చిబాబు ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాలి.