జగన్ బర్త్‌డేకు సినీ హీరో మహేష్ బాబు ఆసక్తికరమైన ట్వీట్

Surya Prakash   | Asianet News
Published : Dec 21, 2020, 01:28 PM ISTUpdated : Dec 21, 2020, 01:32 PM IST
జగన్ బర్త్‌డేకు సినీ హీరో మహేష్ బాబు ఆసక్తికరమైన ట్వీట్

సారాంశం

 ఆయనకు పొలిటీషన్స్ నుంచి, సిని ప్రముఖులు దాకా అందరూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన పుట్టిన రోజు విషెష్ ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ నేపధ్యంలో  టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సైతం సీఎ జగన్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు (డిసెంబర్ 21) 47వ పుట్టిన రోజు జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. తన తండ్రి వైఎస్ మరణం తర్వాత సొంతగా పార్టీ పెట్టి.. కేసులను ఎదుర్కొని.. ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ చరిత్రలో ఎవరూ సాధించలేని అద్భుతమైన ఘన విజయాన్ని అందుకున్నారు. ఏకంగా 151 స్థానాల్లో గెలుపొంది ఓ ప్రభంజనం సృష్టించిన ఆయనకు పొలిటీషన్స్ నుంచి, సిని ప్రముఖులు దాకా అందరూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన పుట్టిన రోజు విషెష్ ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ నేపధ్యంలో  టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సైతం సీఎ జగన్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు. 

https://twitter.com/urstrulyMahesh/status/1340895052390748160

‘ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ విజన్ మరియు కృషితో ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి వైపు నడిపించాలని, మీరు మంచి ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి’ అంటూ మహేష్ ట్వీట్ చేశారు.

 ప్రధాని నరేంద్ర మోదీ.. ఏపీ సీఎంకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరకాలం మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. అలాగే పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలిపారు. మరోవైపు తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం జగన్‌కు విషెస్ తెలిపారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా జగన్ బర్త్ డే సందర్భంగా ట్వీట్ చేశారు. ఇటు వైసీపీలో ప్రముఖ నేతలంతా జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి విలన్ గా రెండు నిమిషాలు మాత్రమే కనిపించిన సినిమా ఏదో తెలుసా?
OTT: ఒకే రాత్రి 3 హ‌త్య‌లు, ఊహ‌కంద‌ని ట్విస్టులు, ప్ర‌తీ సీన్ క్లైమాక్సే.. ఓటీటీలో సూప‌ర్ థ్రిల్ల‌ర్