ఫ్యామిలీతో దుబాయ్ కు మహేష్ బాబు, షూటింగ్ తో పాటు వెకేషన్ కూడా...

Published : Dec 29, 2023, 11:18 AM ISTUpdated : Dec 29, 2023, 11:24 AM IST
ఫ్యామిలీతో దుబాయ్ కు మహేష్ బాబు, షూటింగ్ తో పాటు వెకేషన్ కూడా...

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు వెకేషన్లకు వెళ్ళడం కొత్తేమి కాదు. షూటింగ్స్ ఆపేసి మరీ ఆయన వెకేషన్స్ కు వెళ్తుంటారు. కాని ఈసారి ఫ్యామిలీ వెకేషన్ తో పాటు షూటింగ్ కూడా కంప్లీట్ చేయబోతున్నాడు. 


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మహేష్ బాబు నుంచి సినిమా రాకపోవడంతో డిస్సపాయింట్ అయ్యారు. దాంతో  ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న గుంటూరు కారం సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈసినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ కంప్లీట్ అవ్వగా.. ఇక ఫైనల్ షెడ్యూల్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. 

ఇక ఈమూవీలో హీరోయిన్లు గా  శ్రీలీల, మీనాక్షి చౌదరి  నటిస్తున్నారు. గత కొన్నిరోజులుగా ఈ మూవీలోని పాటల చిత్రీకరణ జరుపుతూ వస్తున్నారు. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో మహేష్, శ్రీలీల పై ఓ మాస్ సాంగ్ ని షూట్ చేశారు. ఇక ఈమూవీ ఈ షెడ్యూల్ తో గుంటూరు కారం పూర్తయ్యింది. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ కూడా ఫిల్మ్ సిటీలోనే కంప్లీట్ చేసినట్టు తెలు్తోంది. ఈక్రమంలో మహేష్ బాబు షూటింగ్  దుబాయ్  వెళ్లారు. అదేంటి షూటింగ్ అయిపోయింది కదా.. దుబాయ్ లో షెడ్యూల్ ఏంటీ అనుకుంటున్నారా..?

 

 

ఇక గుంటూరు కారం షూటింగ్ పూర్తి చేసుకున్న మహేష్ బాబు.. దుబాయ్ కి బయలుదేరారు. అక్కడ ఒక యాడ్ షూటింగ్ కోసం వెళ్తున్నారట. అలాగే ఒక షార్ట్ ఫ్యామిలీ వెకేషన్ ని కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది ట. యాడ్ షూటింగ్ పూర్తి చేసిన తరువాత అక్కడే ఒకటిరెండు రోజులు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. పైగా మహేష్ భార్య నమ్రతకు బంధువులు కూడా ఉన్నారు. దాంతో ఓ వారంపాటు వెకేషన్ ఎంజాయ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈరోజు ఉదయం  హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి మహేష్, నమ్రత, గౌతమ్, సితార.. దుబాయ్ కి బయలుదేరారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

PREV
click me!

Recommended Stories

Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?
అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?