కూతురితో కలసి ఇంటి నుంచి బయటకి వచ్చేసిన నాగార్జున హీరోయిన్.. భర్తతో విడాకులు ?

By tirumala AN  |  First Published Dec 29, 2023, 10:49 AM IST

ప్రముఖ నటి ఇషా కొప్పికర్ నాలుగైదు తెలుగు చిత్రాల్లో మెరిసింది. ఆమె కెరీర్ లో గుర్తుంచుకోదగ్గ చిత్రం అంటే నాగార్జున సరసన నటించిన చంద్రలేఖ మూవీ అనే చెప్పాలి. 


ప్రముఖ నటి ఇషా కొప్పికర్ నాలుగైదు తెలుగు చిత్రాల్లో మెరిసింది. ఆమె కెరీర్ లో గుర్తుంచుకోదగ్గ చిత్రం అంటే నాగార్జున సరసన నటించిన చంద్రలేఖ మూవీ అనే చెప్పాలి. ఆ మూవీలో సాంగ్స్ చాలా బాగా అలరించాయి. ఇషా కొప్పికర్ కూడా గ్లామర్ గా మెరిసింది. పాతికేళ్ల క్రితం వచ్చిన చిత్రంలోనే ఇషా గ్లామర్ మెరుపులు మెరిపించింది. 

అయితే 2009లో ఇషా కొప్పికర్ ఓ రెస్టారెంట్ ఓనర్ అయిన టిమ్మి నారంగ్ ని 2009లో వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె కూడా జన్మించింది. అయితే గత కొంతకాలంగా ఇషా కొప్పికర్, టిమ్మి మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 15 ఏళ్ళు అన్యోన్యంగా ఉన్న జంట మధ్య ఊహించని మనస్పర్థలు ఏర్పడ్డాయట. 

Latest Videos

ఫలితంగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. భర్తతో నిత్యం గొడవలు, కలహాలు భరించలేక ఇషా కొప్పికర్ తన కుమార్తె ని తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. 

మీడియా దీని గురించి ప్రశ్నించినప్పుడు నేరుగా విడాకుల గురించి ప్రస్తావించకుండా.. చెప్పడానికి ఏమిలేదు.. నాకు మాట్లాడడం కూడా ఇష్టం లేదు. దయచేసి ఎవరూ ఏమీ అడగవద్దు. నన్ను ప్రశాంతంగా వదిలేయండి అంటూ సమాధానం ఇచ్చింది. బాలీవుడ్ వర్గాలలో మాత్రం ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుని విడిపోయేందుకే ప్రయత్నిస్తోంది అంటూ ప్రచారం జరుగుతోంది. 

click me!