SuperStar Krishna: తీవ్ర విషాదం.. సాహసాల వీరుడు సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు

Published : Nov 15, 2022, 06:41 AM ISTUpdated : Nov 15, 2022, 08:51 AM IST
SuperStar Krishna: తీవ్ర విషాదం.. సాహసాల వీరుడు సూపర్ స్టార్ కృష్ణ  ఇక లేరు

సారాంశం

తెలుగు చిత్ర పరిశ్రమలో తీరని విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ కి సాహసాలు అంటే ఏంటో నేర్పించిన సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ(79) ఇక లేరు. కుటుంబ సభ్యులని, కోట్లాది మంది అభిమానులని శోకసంద్రంలో ముంచుతూ కొద్దిసేపటి క్రితమే ఆయన మృతి చెందారు. తీవ్ర అస్వస్థత, కార్డియాక్ అరెస్ట్ రావడంతో కృష్ణని కుటుంబ సభ్యులు సోమవారం రోజు కాంటినెంటల్ హాస్పిటల్ లో చేర్పించారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో తీరని విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ కి సాహసాలు అంటే ఏంటో నేర్పించిన సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ(79) ఇక లేరు. కుటుంబ సభ్యులని, కోట్లాది మంది అభిమానులని శోకసంద్రంలో ముంచుతూ కొద్దిసేపటి క్రితమే ఆయన మృతి చెందారు. తీవ్ర అస్వస్థత, కార్డియాక్ అరెస్ట్ రావడంతో కృష్ణని కుటుంబ సభ్యులు సోమవారం రోజు కాంటినెంటల్ హాస్పిటల్ లో చేర్పించారు. 

దీనితో వైద్యులు కృష్ణని ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో కృష్ణ మరణించారు. సూపర్ స్టార్ కృష్ణ అంటే చిత్ర పరిశ్రమలో ఒక చరిత్ర. సాహసాలకు ఆయన పెట్టింది పేరు. గుంటూరు జిల్లా, తెనాలి సమీపంలో బుర్రిపాలెం అనే కుగ్రామంలో మే 31 1943లో ఘట్టమనేని రాఘవయ్య, నాగరత్నమ్మ లకు కృష్ణ జన్మించారు. ఆయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామ కృష్ణ మూర్తి. వీరిది వ్యవసాయ కుటుంబం. 

నటనపై ఆసక్తితో సినిమారంగంలో అడుగు పెట్టారు. ఒడ్డు పొడుగు, ఆకర్షించే అందం , ట్యాలెంట్ పుష్కలంగా ఉండడంతో కృష్ణని అవకాశాలు వరించాయి. 1965లో తేనె మనసులు చిత్రంతో కృష్ణ గారి సినీ ప్రస్థానం మొదలయింది. గూఢచారి 116 అంటూ కౌబాయ్ చిత్రాలతో జైత్ర యాత్ర ప్రారంభించారు. తక్కువ సమయంలోనే స్వర్గీయ ఎన్టీఆర్, ఏఎన్నార్ స్థాయిలో స్టార్ డం సొంతం చేసుకున్నారు. 

సొంతంగా పద్మాలయ స్టూడియోస్ స్థాపించిన కృష్ణ.. ఆ బ్యానర్ లో మొదగాళ్ళకు మోసగాడు, పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు లాంటి అద్భుతమైన చిత్రాలలో నటించారు. కృష్ణ గారి కీర్తి కిరీటంలో అల్లూరి సీతారామరాజు చిత్రం ఒక కలికితురాయి. కృష్ణ గారు నట విశ్వరూపం ఆ చిత్రంలో చూడొచ్చు. 

అలాగే కృష్ణ కురుక్షేత్రం లాంటి పౌరాణిక చిత్రాల్లో కూడా నటించారు.చిత్ర పరిశ్రమ బాగు కోసం కృష్ణ ఎప్పుడూ ముందుంటారు. ఎన్నో సేవాకార్యక్రమాలు చేశారు. భారత ప్రభుత్వం ఆయన్ని 2009లో పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. కృష్ణ మరణ వార్త తెలియగానే ఇండస్ట్రీ ప్రముఖులంతా టాలీవుడ్ పెద్ద దిక్కుని కోల్పోయింది అంటూ విషాదంలో మునిగిపోయారు. 

మహేష్ బాబు అయితే శోక సంద్రంలో మునిగిపోయారు. తండ్రిని కోల్పోయిన బాధలో మహేష్ బాబు తల్లడిల్లిపోతున్నారు. చిన్ననాటి నుంచి కృష్ణ గారు మహేష్ కి నటనలో ఓనమాలు నేర్పిస్తూ.. బాల్యంలోనే అనేక చిత్రాల్లో నటింపజేశారు. నటనలో మహేష్ ఇంతలా రాటుదేలారు అంటే సొంత ప్రతిభతో పాటు కృష్ణ గారి పాత్ర ఎంతైనా ఉంది. ఇటీవల కాలంలో మహేష్ బాబుకి వరుసగా కోలుకోలేని దెబ్బలు తగిలాయి. తన సోదరుడు రమేష్ బాబు మరణించిన కొన్ని నెలలకే తల్లి ఇంద్రాదేవి మరణించారు. ఇప్పుడు తండ్రి కృష్ణ కూడా మరణించడంతో మహేష్ హృదయం ముక్కలైనట్లు అయింది. 

PREV
click me!

Recommended Stories

Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్