గౌతమ్ హీరోగా ఎంట్రీ గురించి సితార కామెంట్స్.. మహేష్ బాబు హ్యాపీ అట

By tirumala AN  |  First Published Aug 24, 2024, 1:39 PM IST

మహేష్ బాబు పిల్లలు గౌతమ్, సితార కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. ముఖ్యంగా సితార అయితే తన డ్యాన్స్ స్కిల్స్ తో అందరిని ఆకర్షిస్తోంది.


సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో రాజమౌళి దర్శకత్వంలో  పాన్ ఇండియా చిత్రంలో నటించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ మూవీ కోసం మునుపెన్నడూ లేని విధంగా మహేష్ తన మేకోవర్ మార్చుకుంటున్నాడు. మహేష్ బాబు పిల్లలు గౌతమ్, సితార కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. 

ముఖ్యంగా సితార అయితే తన డ్యాన్స్ స్కిల్స్ తో అందరిని ఆకర్షిస్తోంది. నటి కావడమే తన లక్ష్యం అని ఆల్రెడీ చెప్పేసింది. మరోవైపు మహేష్ బాబు తనయుడు గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా నెమ్మదిగా చర్చ మొదలవుతోంది. ప్రస్తుతం గౌతమ్ యుఎస్ లో యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. 

Latest Videos

గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ గురించి సితార తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సితార మాట్లాడుతూ అన్నయ్య కూడా యాక్టింగ్ నే తన ప్రొఫెషన్ గా ఎంచుకున్నాడు. అందుకే యుఎస్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. న్యూయార్క్ ఫిలిం అకాడమీలో గౌతమ్ నాలుగేళ్ళ కోర్స్ చేస్తున్నాడు. ఈ కోర్సు పూర్తయ్యాక అన్నయ్య నటుడిగా ఎంట్రీ ఇస్తాడు అంటూ సితార తెలిపింది. 

నాన్న మా ఇద్దరికీ అవసరమైన సపోర్ట్ మొత్తం ఇస్తున్నారు. అన్నయ్య కూడా యాక్టింగ్ ని తన ప్రొఫెషన్ గా ఎంచుకోవడం పట్ల నాన్న చాలా హ్యాపీగా ఉన్నట్లు సితార తెలిపింది. 

click me!