బోల్డ్ సీన్స్ లీక్, నా కష్టం మొత్తం వృధా.. నిద్రలేని రాత్రులు గడిపా అంటూ హీరోయిన్ ఎమోషనల్

By tirumala AN  |  First Published Aug 24, 2024, 12:39 PM IST

యంగ్ బ్యూటీ రుహాని శర్మ చిలసౌ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో రుహాని నటనకి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత కొన్ని చిత్రంలో రుహాని శర్మకి గ్లామర్ రోల్స్ చేసే ఆఫర్స్ వచ్చాయి.


యంగ్ బ్యూటీ రుహాని శర్మ చిలసౌ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో రుహాని నటనకి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత కొన్ని చిత్రంలో రుహాని శర్మకి గ్లామర్ రోల్స్ చేసే ఆఫర్స్ వచ్చాయి. కానీ రుహాని శర్మకి సక్సెస్ దక్కలేదు. అప్పుడప్పుడూ కొన్ని ఆఫర్స్ అందుకుంటోంది కానీ చెప్పుకోదగ్గ చిత్రం అంటూ లేదు. 

వెంకటేష్ సైంధవ్ లాంటి చిత్రాల్లో డిఫెరెంట్ రోల్స్ ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. అయితే ఇటీవల కొన్ని రోజులుగా రుహాని శర్మ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అం నటించిన ఆగ్రా అనే చిత్రంలో బోల్డ్ సన్నివేశాలు వైరల్ అవుతున్నాయి. రుహాని శర్మ శృతి మించిన శృంగార సన్నివేశాల్లో నటించింది అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 

Latest Videos

ఆమెపై అసభ్యకరమైన కామెంట్స్, పోస్ట్ లు పెడుతున్నారు. ఆగ్రా చిత్రం నేరుగా ఓటిటిలో రిలీజ్ అయింది. ప్రైమ్ వీడియోలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రంలో శృంగార సన్నివేశాలు పరిథి దాటి ఉండడంతో ఇండియాలో స్ట్రీమింగ్ కి అనుమతించలేదు. కానీ ఈ చిత్రం పైరసీ లీక్ అయింది. దీనితో నెటిజన్లు రుహాని బోల్డ్ సీన్స్ ని వైరల్ చేస్తున్నారు. 

తన బోల్డ్ సీన్స్ లీక్ కావడం, ట్రోలింగ్ జరుగుతుండడంతో రుహాని తీవ్రంగా మనస్తాపానికి గురైంది. సోషల్ మీడియాలో ఎమోషనల్ కామెంట్స్ చేస్తూ అనవసరంగా తనని నిందిస్తూ ట్రోల్ చేయద్దని రిక్వస్ట్ చేసింది. రుహాని పోస్ట్ చేస్తో.. అందరికీ హాయ్. నేను నటించిన ఆగ్రా చిత్రం లీక్ అయింది. నేను చెబుతున్న విషయాలు మీరంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఈ మావోయి లీక్ కావడంతో కొన్ని నెలలపాటు నేను పడ్డ కష్టం మొత్తం వృధా అయింది. 

 

ఆర్ట్ ఫిలిం తీయడం అంటే సాధారణమైన విషయం కాదు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఆగ్రా చిత్రం విషయంలో నన్ను చాలా మంది జడ్జ్ చేస్తున్నారు. కానీ ఈ మూవీ గత ఏడాది కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది. ఈ చిత్రంలో నేను నటించిన సన్నివేశాల విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ మూవీ కోసం నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. మీకు ఫిలిం మేకింగ్ గురించి తెలియకపోతే ఏది పడితే అది తిట్టొద్దు, జడ్జ్ చేయవద్దు. నేను పడ్డ శ్రమని చిన్నచూపు చూడకండి అంటూ  రుహాని శర్మ  ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. 

click me!